Site icon HashtagU Telugu

CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన గూగుల్ వీపీ

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: గూగుల్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నది. అందులో భాగంగా ఈ రోజు జనవరి 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గూగుల్ వీపీ సమావేశమయ్యారు. వ్యవసాయం, విద్య మరియు ఆరోగ్యం కోసం సమగ్ర డిజిటలైజేషన్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంతో భాగస్వామ్యం కోసం గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట ముందుకొచ్చారు.

తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించడానికి లోతైన సాంకేతికత మరియు నైపుణ్యం కలిగి ఉండాల్సిన అవసరం ఉందని టెక్ దిగ్గజం గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట అభిప్రాయపడ్డారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివిధ రంగాలలో పెద్ద మార్పు తీసుకురావడానికి సిద్ధంగా ఉందని, దానిపై హైదరాబాద్ మరియు తెలంగాణలో గూగుల్ పెట్టుబడులకు సీఎంతో చర్చించారు. హైదరాబాద్ మరియు తెలంగాణలో గూగుల్ మ్యాప్స్ మరియు గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి రహదారి భద్రతను మెరుగుపరచాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

గూగుల్ అతిపెద్ద క్యాంపస్‌ హైదరాబాద్‌లో రాబోతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్లస్టర్ అయిన గచ్చిబౌలిలో 33 లక్షల చదరపు అడుగుల భవనం రాబోతోంది. 2019లో కొనుగోలు చేసిన 7.3 ఎకరాల స్థలంలో క్యాంపస్ డిజైన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. క్యాంపస్‌ను మొదట రూ. 1,000 కోట్ల పెట్టుబడితో 2 మిలియన్ చదరపు సౌకర్యంగా ప్లాన్ చేశారు. గత ఐటి మంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలోని కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినప్పుడు 2015లో తెలంగాణ ప్రభుత్వం మరియు గూగుల్ మధ్య ఒప్పందం కుదిరింది.

గూగుల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో లీజుకు తీసుకున్న భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇక్కడ సుమారు 7,000 మంది ఉద్యోగులు సంస్థలో పని చేస్తున్నారు. కొత్త క్యాంపస్ 2019లో సిద్ధం అవుతుందని ముందుగా భావించిన ఈ క్యాంపస్, ఉద్యోగుల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసే అవకాశం ఉంది.

Also Read: Hanu Man First Review : ‘హనుమాన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ మాములుగా ఇవ్వలేదు

Exit mobile version