ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ (Indiramma Houses) పథకానికి కేంద్ర ప్రభుత్వం (Central Govt) అదనపు నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఒక్కో ఇందిరమ్మ ఇంటికి కేంద్రం రూ.72 వేలు అందిస్తోంది. ఇకపై, ఈ నిధులకు అదనంగా మరిన్ని నిధులు చేరనున్నాయి. ఈ నిర్ణయం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, లబ్ధిదారులకు ఆర్థికంగా మరింత చేయూతనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ
కొత్తగా అందిన సమాచారం ప్రకారం, కేంద్రం ఉపాధి హామీ పథకం ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా రూ.27 వేలు చెల్లించనుంది. దీనివల్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణం కోసం కూలీ ఖర్చులను భరించాల్సిన అవసరం తగ్గుతుంది. అంతేకాకుండా, లబ్ధిదారులకు జాబ్ కార్డు ఉంటే, ఇంటి పని కింద 90 రోజుల పాటు పనిచేసినందుకు రోజుకు రూ.300 చొప్పున చెల్లించనున్నారు. దీంతో లబ్ధిదారులకు నెలకు రూ.9,000 చొప్పున అదనపు ఆదాయం లభిస్తుంది.
వీటితో పాటు, స్వచ్ఛ భారత్ పథకం కింద మరో రూ.12 వేలు కూడా ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం అందించనుంది. ఈ విధంగా మొత్తం రూ.5 లక్షల ఇంటి నిర్మాణ ఖర్చులో, కేంద్రం మొత్తం రూ.1.11 లక్షలు మంజూరు చేస్తుంది. మిగిలిన రూ.3.89 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ అదనపు నిధులు లబ్ధిదారులకు పెద్ద ఊరటగా మారనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.