Site icon HashtagU Telugu

TSPSC Group1: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గ్రూప్‌-1 పోస్టుల పై కీల‌క నిర్ణ‌యం

Tspsc

Tspsc

TSPSC Group1: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇప్పటికే ఆరుగ్యారంటీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్ర‌భుత్వం గ్రూప్‌-1 పోస్టుల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌రో 60 పోస్టుల‌ను పెంచుతూ తాజాగా ఆర్థిక శాఖ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. గ‌తంలో 503 గ్రూప్‌-1 పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే.

ఇప్పుడు తాజాగా 503 పోస్టులు.. మరో 60 అదనపు పోస్టులు కలిపి 563 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఆర్థిక, హోం, లేబర్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌, పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌డెవలప్‌మెంట్‌, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లలో వివిధ పోస్టులు కలిపి మొత్తం 60 పోస్టులను పాత నోటిఫికేషన్‌కు జత చేస్తూ మూడో తేదీన నిర్ణయం తీసుకుంది.

కాగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కార్యదర్శిగా డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన్ను ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిగా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ కార్యదర్శిగా పనిచేస్తున్న అనితా రామచంద్రన్‌ను పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. అలాగే బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌గా బి.బాలమాయాదేవి బాధ్యతలు స్వీకరించారు.

Exit mobile version