Site icon HashtagU Telugu

TS : నిరుద్యోగులకు గుడ్ న్యూస్…గురుకులాల్లో ఖాళీల భర్తీకి ప్రకటన…చివరి తేదీ ఎప్పుడంటే..!!

Government Of Telangana Logo

Government Of Telangana Logo

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. లెక్చరర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి బీసీ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి శుభవార్త చెప్పారు. గురుకులాల్లో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 15బీసీ గురుకులడిగ్రీ కాలేజీల్లో బోధన సిబ్బంది నియమాకాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు.

15గురుకుల డిగ్రీ కాలేజీల్లో తెలుగు, ఇంగ్లీష్,మ్యాథ్స్,ఫిజిక్స్, కెమిస్ట్రీ,కంప్యూటర్, సైన్స్,డేటా సైన్స్,ఆర్టిఫియల్ ఇంటిలిజెన్స్ అండె మెషిన్ లెర్నింగ్ స్టాటిక్స్, జియాలజీ,బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, కామర్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ తోపాటుగా హిస్టరీ, పొలిటికల్ సైన్స్,ఇంటర్నేషనల్ రిలేషన్స్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్,ఎకనామిక్స్, సోషియాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,మేనేజ్ మెంట్ జియోగ్రఫీ వంటి కోర్సుల్లో భోధించే అనుభవం గల లెక్చరర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విద్యాసంస్థల కార్యదర్శి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆయా జిల్లాల మహాత్మా జ్యోతిభాపూలే బీసీ గురుకుల విద్యాసంస్థల ఆర్ సివోలకు తమ దరఖాస్తులు అందించాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 12వ తేదీ చివరి తేదీ.