Site icon HashtagU Telugu

Transgender Clinic: ట్రాన్స్ జెండర్స్ కు గుడ్ న్యూస్.. ఉస్మానియాలో ప్రత్యేక ఆస్పత్రి

Transgendar

Transgendar

థర్డ్ జెండర్‌కు ఆరోగ్య సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం పాటు పడుతోంది. ఈ మేరకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ ను ప్రారంభించింది. సెన్సిటైజేషన్ శిక్షణ పొందిన వైద్య నిపుణులతో కూడిన సిబ్బంది, ఈ అట్టడుగు వర్గానికి చెందిన రోగులు అనేక రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం క్లినిక్ వారానికి ఒకసారి బుధవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తుంది

డాక్టర్ రాకేష్ సహాయ్, డాక్టర్ నీలవేణి, ఇద్దరు ఎండోక్రినాలజిస్టులు లింగమార్పిడి వ్యక్తులకు హార్మోన్ల చికిత్స, ఇతర అవసరమైన చికిత్సలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.  గైనకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సైకియాట్రీ, యూరాలజీ ఇతర విభాగాలు కూడా అవసరమైనప్పుడు సహాయం చేస్తాయి. ఈ సమర్థులైన వైద్యుల బృందంతో పాటు, తెలంగాణ తొలి లింగమార్పిడి వైద్యులు – డాక్టర్ ప్రాచీ రాథోడ్,  డాక్టర్ రూత్ జాన్ పాల్ కూడా సమన్వయకర్తలుగా నియమితులయ్యారు.

“లింగమార్పిడి వ్యక్తులు ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడం చాలా కష్టం. కానీ ఈ రోజు మేము ఎటువంటి వివక్ష లేకుండా ఉచితంగా చికిత్స అందించే క్లినిక్‌ని కలిగి ఉన్నాం” అని డాక్టర్ ప్రాచి చెప్పారు. LGBTQIA గొడుగు కింద కేవలం లింగమార్పిడి వ్యక్తులకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా సేవలను అందించడం ఈ క్లినిక్ లక్ష్యం. “మేం ఇక్కడ వైద్యాధికారులుగా నియమించబడక ముందే, ట్రాన్స్ జెండర్ పెద్దలు OGHలో లింగమార్పిడి క్లినిక్ కోసం ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా ఆస్పత్రి ఏర్పాటైంది. వైద్య మార్గదర్శకాలను రూపొందించడానికి మేం ఒక బృందాన్ని ఏర్పాటు చేసాం, ”అని డాక్టర్ రూత్ అన్నారు.

Also Read: Sitara Remuneration: సితార క్రేజ్.. జ్యువెలరీ యాడ్‌ కు కోటి రూపాయల రెమ్యునరేషన్