Telangana Government: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. భారీగా ఉద్యోగాల భర్తీ!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులైన మహిళలకు ముఖ్య గమనిక.. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాదిలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అంగన్‌వాడీలలో కొంతమందికి ప్రమోషన్లు రావడం, మరికొందరు రిటైర్ అవుతున్నారు. ఈ మేరకు 2025-2026 నాటికి ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుంటున్నారు. 2025-26 ఏడాది నాటికి […]

Published By: HashtagU Telugu Desk
Good News for the Unemployed: Massive Job Recruitment!

Good News for the Unemployed: Massive Job Recruitment!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులైన మహిళలకు ముఖ్య గమనిక.. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీకి ఈ ఏడాదిలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అంగన్‌వాడీలలో కొంతమందికి ప్రమోషన్లు రావడం, మరికొందరు రిటైర్ అవుతున్నారు. ఈ మేరకు 2025-2026 నాటికి ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుంటున్నారు.

2025-26 ఏడాది నాటికి పదోన్నతులు, పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీలను పరిగణనలోకి తీసుకున్నారు. కొత్తగా ఏర్పడిన 708 ఉద్యోగాలను కూడా కలిపి 15,982 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో హెల్పెర్స్ పోస్టులు 12,882 ఉన్నాయి. టీచర్ పోస్టులు 3,100 ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,781 అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటే సుమారు 71,562 మంది పనిచేస్తున్నారు. వీరిలో టీచర్లు, వర్కర్లు ఉన్నారు. అంగన్‌వాడీలలో గత మూడేళ్లుగా పదవీ విరమణ, సిబ్బందికి సూపర్‌వైజర్లుగా ప్రమోషన్లు రావడంతో, కొంతమందికి వేరే శాఖలలో శాశ్వత ఉద్యోగాలు రావడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో 22.33 శాతం పోస్టులు ఖాళీ అయ్యాయి.

త్వరలో శిశు సంక్షేమ శాఖ విద్యార్హతలు, నియామక విధానంపై స్పష్టత ఇవ్వనుంది. ముందుగా అంగన్‌వాడీలలో కొత్త నియామక విధానానికి ఆమోదం తెలిపి, ఆ తర్వాత జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. అంగన్‌వాడీల్లో ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు 9 వేల కేంద్రాలకు కరెంట్ కనెక్షన్లు, 7,700 కేంద్రాలకు మరుగుదొడ్లు, మరో 5 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్వో ప్లాంట్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు. 3,300 కేంద్రాలకు తాగునీటి సదుపాయం కల్పించనున్నారు. వెయ్యి కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నారు. మొత్తం మీద తెలంగాణ సర్కార్ ఈ ఏడాది అంగన్‌వాడీల్లో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. తెలంగాణలో నిరుద్యోగ మహిళలకు ఇది చక్కనైన అవకాశం. త్వరలోనే ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయనుంది. రాష్ట్రంలో ఈసారి ఏకంగా 15,982 అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

 

 

 

  Last Updated: 22 May 2026, 09:38 AM IST