Site icon HashtagU Telugu

TS : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త…త్వరలోనే పలు శాఖల్లో 16వేల పోస్టులు భర్తీ..!!

Somesh Kumar

Somesh Kumar

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపికబురందించారు తెలంగాణ సీఎం సోమేశ్ కుమార్. త్వరలోనే పలు శాఖల్లో మరో 16వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వాటికి సంబంధించిన అనుమతులకు ఇస్తామన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్థనరెడ్డితో కలిసి పలు శాఖ అధికారులతో సీఎస్ సమీక్షించారు. అనంతరం సోమేష్ కుమార్ మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికి పలు శాఖల్లో మొత్తం 60వేలకు పైగానే పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. త్వరలో మరో 16వేల పోస్టులకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఇక టీఎస్ పీఎస్సీ ద్వారా 9వేల గ్రూప్ IV ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీంతో శాఖల వారీగా త్వరలోనే కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. పలు ప్రభుత్వ శాఖల్లోని శాఖల వారీగా జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులతోపాటుగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను తెలియజేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

Exit mobile version