Site icon HashtagU Telugu

Navodaya Jobs 1377 : ‘నవోదయ’లో 1377 జాబ్స్.. అప్లై చేసుకోండి

Navodaya Jobs

Navodaya Jobs

Navodaya Jobs 1377 :   1377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి  నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి ఎంపికయ్యే అభ్యర్థులు దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయ సమితికి చెందిన కార్యాలయాల్లో, జవహర్ నవోదయ విద్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. మొత్తం 1377 పోస్టులలో(Navodaya Jobs 1377)..  442 మెస్ హెల్పర్  పోస్టులు, 381 జూనియర్ సెక్ట్రటేరియట్​ అసిస్టెంట్​ పోస్టులు ఉన్నాయి. ల్యాబ్​ అటెండెంట్​ పోస్టులు 161, ఎలక్ట్రీషియన్ కమ్​ ప్లంబర్  పోస్టులు 128, ఫిమేల్​ స్టాఫ్​ నర్స్​ పోస్టులు 121, క్యాటరింగ్ సూపర్​వైజర్ పోస్టులు 78 ఉన్నాయి. అసిస్టెంట్​ సెక్షన్ ఆఫీసర్​ – 5 పోస్టులు, ఆడిట్ అసిస్టెంట్​ – 12 పోస్టులు, జూనియర్​ ట్రాన్స్​లేషన్ ఆఫీసర్​ – 4 పోస్టులు, లీగల్ అసిస్టెంట్ – 1 పోస్టు, స్టెనోగ్రాఫర్​ – 23 పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ – 2 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్​ – 19 పోస్టులు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join

అర్హతలు, ఎంపిక విధానం.. 

Also Read : T Congress : కాంగ్రెస్ గూటికి చేరిన దానం నాగేందర్..

దరఖాస్తు రుసుము

ఫిమేల్ స్టాఫ్ నర్స్​ పోస్టులకు జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1500 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
మిగతా అన్ని పోస్టులకు జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.

Also Read :LinkedIn : లింక్డ్‌ఇన్ గేమింగ్ ప్లాట్‌ఫాం కాగలదా..?

ఈ జాబ్స్‌కు అప్లై చేసేవారికి ఏపీలోని విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురంలలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. తెలంగాణలోని హైదరాబాద్​, మహబూబ్​నగర్​, నిజామాబాద్​, ఖమ్మం, కరీంనగర్​లలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఆన్​లైన్​ దరఖాస్తు, పరీక్ష తేదీలు త్వరలో వెల్లడించనున్నారు.

Also Read : Paytm FasTag: మీ పేటీఎం ఫాస్టాగ్‌ డీయాక్టివేట్ చేయాలా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో కావాల్సిందే..!