తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Amrit Bharat Express  హైదరాబాద్‌లోని చర్లపల్లి స్టేషన్ నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసును మార్చి 13న కామాఖ్యలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే అసోంతో కలుపుతుంది. ఈ రైలులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. తక్కువ ఖర్చుతో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని […]

Published By: HashtagU Telugu Desk
New Amrit Bharat Express.

New Amrit Bharat Express

Amrit Bharat Express  హైదరాబాద్‌లోని చర్లపల్లి స్టేషన్ నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసును మార్చి 13న కామాఖ్యలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే అసోంతో కలుపుతుంది.

ఈ రైలులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. తక్కువ ఖర్చుతో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఈ రైలు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే సుదూర ప్రయాణికులకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. ఈ రైలు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.

రెండు రోజుల క్రితమే తమిళనాడులోని నాగర్‌కోయిల్ నుంచి చర్లపల్లి వరకు మరో అమృత్ భారత్ రైలును రైల్వే శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను ప్రవేశపెట్టారు. అధునాతన భద్రతా ఫీచర్లు, సెమీ ఆటోమేటిక్ కప్లర్లు, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్ వంటి సౌకర్యాలతో వీటిని రూపొందించారు. నాన్-ఏసీ కోచ్‌లలో కూడా ప్రయాణికుల భద్రత కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడం ఈ రైళ్ల ప్రత్యేకత.

  Last Updated: 10 Mar 2026, 03:17 PM IST