తెలంగాణ రైతులకు శుభవార్త..

Telangana Farmers  తెలంగాణలోని గిరిజన రైతుల భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కోసం నాబార్డ్ నుండి రూ. 600 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అటవీ హక్కుల పత్రాలు (ROFR) కలిగిన 2.1 లక్షల మంది రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ప్రతి రైతుకు రూ. 6 లక్షల విలువైన సోలార్ […]

Published By: HashtagU Telugu Desk
Telangana Farmers

Telangana Farmers

Telangana Farmers  తెలంగాణలోని గిరిజన రైతుల భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కోసం నాబార్డ్ నుండి రూ. 600 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అటవీ హక్కుల పత్రాలు (ROFR) కలిగిన 2.1 లక్షల మంది రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ప్రతి రైతుకు రూ. 6 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు, ప్యానెళ్లను 100 శాతం సబ్సిడీతో ఉచితంగా అందజేస్తారు. ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా రైతులకు నెలకు రూ. 5,000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. మార్చిలో నిధులు అందగానే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది.

తెలంగాణలోని గిరిజన రైతుల సాగు భూములకు నీటి సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘ఇందిర సౌర గిరి జల వికాసం’’ పథకం అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ పథకం కోసం జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) నుంచి రుణాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికే నాబార్డ్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు.

తొలి దశలో 10 వేల మందికి లబ్ధి..

ప్రభుత్వ గ్యారెంటీతో మొదటి విడతలో రూ. 600 కోట్ల రుణం ఇచ్చేందుకు నాబార్డ్ సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే మార్చి నెల నాటికి ఈ నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా ప్రభుత్వం మరో రూ. 600 కోట్లు కేటాయించిన నేపథ్యంలో.. పథకం అమలు మరింత వేగవంతం కానుంది. నిధులు అందిన వెంటనే అన్ని జిల్లాల్లో అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఈ పథకం కింద అటవీ హక్కుల పత్రాలు (ROFR) కలిగిన సుమారు 2.1 లక్షల మంది గిరిజన రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో రైతుకు దాదాపు రూ. 6 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు, ప్యానెళ్లను 100 శాతం సబ్సిడీతో ఉచితంగా అందజేస్తారు. వ్యవసాయ అవసరాల కోసం వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను విద్యుత్ గ్రిడ్‌కు విక్రయించే అవకాశం కల్పిస్తున్నారు. తద్వారా రైతులకు నెలకు రూ. 3,000 నుండి రూ. 5,000 వరకు అదనపు ఆదాయం లభించనుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతేడాది మే 19న నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని భూములకు ఈ సోలార్ పంపులు వరంగా మారనున్నాయి. కేవలం సాగునీరు అందించడమే కాకుండా.. రైతును ఇంధన ఉత్పత్తిదారుడిగా మార్చడం ఈ పథకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

 

  Last Updated: 29 Jan 2026, 03:28 PM IST