Good News For Students: తెలంగాణ రాష్ట్ర విద్యా రంగ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో ఒకే సారి కామన్ మెనూ (Good News For Students) విజయవంతంగా అమలు ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరులోని టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనగా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం బోనకల్ లోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, గ్రంధాలయ ఛైర్మెన్లు ఇతర ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపిఎస్, ఐ.ఎఫ్.ఎస్ రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో కామన్ డైట్ ను ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కొరకు చదువుతో పాటు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలో ఒకే రకమైన పౌష్టిక ఆహారం అందించే విధంగా డైట్ చార్జీలు 40% & కాస్మోటిక్ చార్జీలు 200% పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. పెంచిన డైట్ చార్జీల కనుగుణంగా కామన్ డైట్ అమలులోకి వచ్చింది. రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు దాదాపు 140 ఈ కామన్ డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు 450 మంది సీనియర్ IAS, IPS, IFS అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా సీనియర్ అధికారులు రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు, తల్లితండ్రుల సమక్షంలో కామన్ డైట్ ను ప్రారంభించి, విద్యార్థులతో కల్సి భోజనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇక నుండి ప్రతి నెలా 10 వ తేదీనే డైట్ చార్జీల బిల్లులను గ్రీన్ ఛానెల్ లో చెల్లించనున్నట్టు ప్రకటించారు.
Also Read: Big Shock For YCP: జగన్ సొంత జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్.. బీజేపీలోకి గ్రంధి?
వికారాబాద్ పట్టణంలోని మైనారిటీ సంక్షేమ హాస్టల్లో రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కామన్ డైట్ ను ప్రారంభించారు. తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురం గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల(బాలురు) లో విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు, కామన్ డైట్ మెనూ ను రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ షేక్ పేట సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బాయ్స్ కళాశాలలో కామన్ డైట్ మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర బీ.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో మహిళా శిశు సంక్షేమమే, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.
గణపురం మండలం, గాంధీనగర్ లో మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో నూతన డైట్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు లు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంచరీ జూనియర్ కళాశాల (BRAC, TSWR JC Boys) ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు అందించే డైట్ చార్జీల పెంపు, కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లా మహేంద్ర హిల్స్ గర్ల్స్ సంక్షేమ హాస్టల్ లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామన్ డైట్ ను ప్రారంభించారు.
నెలకు 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్!
తెలంగాణ విద్యార్థులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులకు పోషకాహారంతో పాటు, రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రత్యేక మెనూ ప్రకారం.. ఇకపై విద్యార్థులకు లంచ్‌లో నెలలో రెండు సార్లు మటన్‌తో పాటు నాలుగు సార్లు చికెన్ పెట్టనున్నారు. నాన్‌వెజ్ లేని మిగతా రోజుల్లో లంచ్‌లో ఉడికించిన గుడ్డు లేదా ఫ్రైడ్ ఎగ్ ఇవ్వనున్నట్టు సమాచారం.