విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!

christmas Holidays 2025 : విద్యార్థులకు ఇది ఎగిరి గంతేసే వార్త.. క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 25, 26 క్రిస్టమస్, బాక్సింగ్ డే సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం 5 రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. గతంలో క్రిస్మస్ సందర్భంగా వారం నుంచి పది రోజులు సెలవులు ఇచ్చే వారు. అయితే ఈసారి అవి చాలా వరకు తగ్గిపోయాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. […]

Published By: HashtagU Telugu Desk
Christmas Holidays 2025 Sch

Christmas Holidays 2025 Sch

christmas Holidays 2025 : విద్యార్థులకు ఇది ఎగిరి గంతేసే వార్త.. క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 25, 26 క్రిస్టమస్, బాక్సింగ్ డే సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం 5 రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. గతంలో క్రిస్మస్ సందర్భంగా వారం నుంచి పది రోజులు సెలవులు ఇచ్చే వారు. అయితే ఈసారి అవి చాలా వరకు తగ్గిపోయాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

  • విద్యార్థులకు శుభవార్త
  • క్రిస్మస్ సెలవులు ప్రకటన
  • క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు 5 రోజులు సెలవులు

సెలవులు అంటే ఇష్టం లేని విద్యార్థులుంటారా.. అయితే కొన్నికొన్ని నెలల్లో అసలు సెలవులే రావు. కొన్ని నెలల్లో కచ్చితంగా వచ్చే సెలవులు ఉంటాయి. డిసెంబర్‌లో విద్యార్థులకు కచ్చితంగా సెలవులు ఉంటాయి. అవే క్రిస్మస్ సెలవులు. గతంలో ప్రతి స్కూల్‌కి వారం నుంచి పది రోజులు క్రిస్మస్ సెలవులు ఇచ్చేవారు. అయితే, గత కొన్నాళ్లుగా క్రిస్మస్ సెలవులను తగ్గిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సంవత్సరం క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. చాలా వరకు స్కూళ్లకు రెండు రోజులు మాత్రమే సెలవు ఉంటుండగా… కొన్ని పాఠశాలలకు మాత్రం 5 రోజులు సెలవులు ఇచ్చారు.

ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు అన్నిటికీ సెలవు ఉంటుంది. అయితే, క్రిస్మస్ మరుసటి రోజు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. డిసెంబర్ 26వ తేదీన బాక్సింగ్ డే సందర్భంగా స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు.

అధికారిక సెలవులు:

  • డిసెంబర్ 25 (క్రిస్మస్)
  • డిసెంబర్ 26 (బాక్సింగ్ డే)

మధ్యలో డిసెంబర్ 27, శనివారం కొందరికి పాఠశాల ఉంటుంది, కొందరికి ఉండదు, కొందరికి హాఫ్ డే ఉంటుంది. ఈ క్రమంలో శనివారం మినహాయిస్తే, డిసెంబర్ 28వ తేదీ ఆదివారం కూడా స్కూళ్లకు సెలవులు ఉన్నాయి. అయిత క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు ఈ సెలవుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ స్కూళ్లకు ఏకంగా 5 రోజులు సెలవులు వచ్చేందుకు అవకాశం ఉంది. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 28 వరకు సెలవులు ఇచ్చేందుకు అవకాశం ఉంది.

హైదరాబాద్ వ్యాప్తంగా స్కూళ్లకు డిసెంబర్ 24వ తేదీ నుంచే క్రిస్మస్ సెలవులు రానున్నాయి. దీనికి ముందుగానే పాఠశాలలో FA III (ఫార్మేటివ్ అసెస్‌మెంట్ III) పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు డిసెంబర్ 23వ తేదీకి ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మరుసటి రోజు నుంచే స్కూళ్లకు సెలవులు ప్రకటించనున్నారు. ఇక 2026 ఫిబ్రవరి నెలలో FA IV (ఫైనల్ ఎగ్జామ్స్) కూడా నిర్వహిస్తారు.

తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 24వ తేదీన నుంచి క్రిస్మస్ పండుగ వేడుకలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ రోజు నుంచే స్కూళ్లకు సెలవు ప్రకటిస్తారు. ఈ రెండు రోజుల కాకుండా.. అదనంగా వచ్చే సెలవుల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

  Last Updated: 19 Dec 2025, 02:58 PM IST