Site icon HashtagU Telugu

Singareni Employees : సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారసుల వయోపరిమితి పెంపు

Singareni Employees

Singareni Employees

Singareni Employees : సింగరేణిలో కారుణ్య నియామకాల అంశం ఎంతో కీలకమైంది. అది వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలతో  ముడిపడిన ఇష్యూ. దీనిపై  సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి ఉద్యోగులు చనిపోతే వారి స్థానంలో కారుణ్య నియామకం కోసం అప్లై చేసుకునే వారి వయోపరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇంతకు ముందు వరకు కారుణ్య నియామకం కోసం అప్లై చేసుకునే వారికి వయో పరిమితి 35 ఏళ్లుగా ఉండేదని.. దీన్ని 40 ఏళ్లకు పెంచినట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Also Read :Parliament Session : జూన్ 24 నుంచి పార్లమెంటు సమావేశాలు.. స్పీకర్ ఎవరో ?

దీనిపై సోమవారం సాయంత్రమే ఉత్తర్వులు జారీ చేశామని సింగరేణి కాలరీస్ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2018 మార్చి 9వ తేదీ నుంచి ఈ గరిష్ట వయోపరిమితి సడలింపు అమల్లోకి వస్తుందని చెప్పారు. దీనివల్ల 2018 నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న దాదాపు 300 మందికి తక్షణ ప్రయోజనం చేకూరనుందన్నారు. గరిష్ట వయో పరిమితి దాటిన కొందరు గతంలో సింగరేణిలో కారుణ్య నియామకం కోసం దొంగ ధ్రువీకరణ పత్రాలను సమర్పించి దొరికిపోయారు. వయోపరిమితి పెంచడం వల్ల ఇకపై అలాంటి తప్పుడు మార్గాలను అనుసరించే అవకాశం ఉండదు.

We’re now on WhatsApp. Click to Join

ఇంతకుముందు వయో పరిమితి 35  ఏళ్లు ఉండటం వల్ల  సింగరేణి ఉద్యోగుల(Singareni Employees) కుటుంబాలకు చెందిన వందలాది మంది ఉద్యోగ అవకాశాలను పొందలేకపోయారు. సీఎం రేవంత్ సూచన మేరకు ఈ అంశంపై తాజాగా సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకున్నారు. వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచారు. సింగరేణి సంస్థలో పనిచేస్తూ ఎవరైనా కార్మికుడు లేదా ఉద్యోగి చనిపోతే.. అతడి వారసుల్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది. అనారోగ్య కారణాల రీత్యా ఉద్యోగానికి అనర్హులుగా మెడికల్ బోర్డు ప్రకటించిన కార్మికుల వారసులకు కూడా సింగరేణి సంస్థ బదిలీ వర్కర్‌గా ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది.  అయితే ఈ రెండు విభాగాల్లోనూ వారసుల కనిష్ట వయసు 18 సంవత్సరాలుగా.. గరిష్ట వయసు 35 సంవత్సరాలుగా గతంలో పేర్కొన్నారు. తాజాగా గరిష్ఠ వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచడం గమనార్హం.

Also Read :KCR : ఆ వ్యవహారంలో కేసీఆర్‌ సహా 25 మందికి నోటీసులు.. 15కల్లా వివరణ ఇవ్వాలని ఆర్డర్