SI Constable Aspirants: ఎస్సై, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌.. క‌టాఫ్ మార్కులు తగ్గించిన రిక్రూట్‌మెంట్ బోర్డు!

SI Constable Aspirants: ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌లు రాసిన అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త అందించింది బోర్డు. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ల్లో అభ్య‌ర్థుల క‌టాఫ్ మార్కుల‌ను తగ్గిస్తూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

  • Written By:
  • Updated On - October 2, 2022 / 11:21 PM IST

SI Constable Aspirants: ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌లు రాసిన అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త అందించింది బోర్డు. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ల్లో అభ్య‌ర్థుల క‌టాఫ్ మార్కుల‌ను తగ్గిస్తూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం 200 మార్క‌ల‌కు గాను ఓసీల‌కు 30 శాతం, బీసీల‌కు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు 20 శాతం వ‌స్తే క్వాలిఫై కానున్నారు. అంటే ఓసీ అభ్య‌ర్థుల‌కు 60 మార్కులు, బీసీ అభ్య‌ర్థుల‌కు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు 40 మార్కులు వ‌స్తే దేహ‌దారుడ్య ప‌రీక్ష‌లకు అర్హ‌త సాధిస్తార‌ని టీఎస్ఎల్‌పీఆర్బీ ప్ర‌క‌టించింది.

అయితే.. గత కొద్ది రోజులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు క‌టాఫ్ కోసం ఆందోళ‌న చేసిన విష‌యం తెలిసిందే. ఆగస్ట్ 7వ తేదీన ఎస్సై ప్రిలిమ్స్‌, 28వ తేదీన ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వ‌హించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ల్లో కొన్ని ప్ర‌శ్న‌లు తిక‌మ‌క‌గా వ‌చ్చాయి. దీంతో అభ్య‌ర్థులు ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో సీఎం కేసీఆర్ ఇటీవ‌ల ప్రిలిమ్స్ అభ్య‌ర్థుల‌కు క‌టాఫ్ మార్క్స్ తగ్గిస్తామ‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో తాజాగా బోర్డు క‌టాఫ్ తగ్గిస్తూ నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది. దీంతో నిరుద్యోగులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష‌ల‌ను ఈనెల‌లో విడుద‌ల చేయాల‌ని బోర్డు క‌స‌ర‌త్తులో చేస్తోంది.