Site icon HashtagU Telugu

TS RTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్…త్వరలోనే జీతాలు పెంపు..!!

Telangana RTC

Tsrtc

టీఎస్ టీఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు గుడ్ న్యూస్. త్వరలోనే 2017పీఆర్సీ అమలు చేస్తామని ఆర్టీసీ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ప్రకటించారు. త్వరలోనే ఈ విషయం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటన చేస్తారని చెప్పారు. కాగా ఆర్టీసీలో పీఆర్సీ ప్రకటనకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక కోడ్ ముగిసింది. దీంతో పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోది.

అయితే పీఆర్సీ బకాయిలను ఆర్టీసీ భరిస్తుందా లేదా ప్రభుత్వమే భరిస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కాగా తెలంగాణ ఆర్టీసీ డిజిటల్ టికెట్ల జారీకి రంగం సిద్ధం చేస్తోంది. దీంతో సమాయాన్ని ఆదా చేయడంతోపాటు చిల్లర సమస్య లెక్కల్లో తేడాకు సంబంధించి అడ్డుకట్ట వేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా డిజిటల్ పేమెంట్ చేసి టికెట్లు పొందేలా యంత్రాలను జారీ చేస్తోంది ఆర్టీసీ.