Site icon HashtagU Telugu

Ayodhya: రామయ్య భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఫ్లైట్!

Ayodhya

Ayodhya

Ayodhya: ప్రధాన మెట్రో నగరాల తర్వాత హైదరాబాద్ ఎంతో డెవలప్ అవుతోంది. తాజాగా  ఇప్పుడు ఇక్కడి నుంచి అయోధ్యకు నేరుగా విమాన రాకపోకలు కొనసాగనున్నాయి. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సమాచారం ప్రకారం.. హైదరాబాద్, అయోధ్య మధ్య ప్రత్యక్ష విమాన కనెక్టివిటీపై కొన్ని వాణిజ్య విమానయాన సంస్థలతో చర్చలు జరపడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చొరవ తీసుకుందని ఆయన తెలిపారు.

ఈ సౌకర్యం కోసం రెడ్డి ఫిబ్రవరి 26న మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాసిన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించిందన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, అయోధ్య మధ్య ప్రత్యక్ష విమానాన్ని ఏప్రిల్ 2 నుండి మంగళ, గురు, శనివారాల్లో వారానికి మూడుసార్లు నడపనున్నారు.

కాగా అయోధ్యలో రామ మందిరం ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ నుంచి రామ భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను(Ayodhya Special Trains) ఏర్పాటు చేశారు బీజేపీ నాయకులు. రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాల్లోని భక్తులకు రామమందిరం దర్శనానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మాట్లాడి ప్రత్యేక సర్వీసులను సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఇక అయోధ్య పర్యాటకంగా ఎంతో డెవలప్ అవుతోంది.