Ration Cards: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తూ దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు పథకాలను ప్రవేశపెట్టిన ఆ పార్టీ, మరో ముఖ్యమైన హామీని ద్రుష్టి సారించనుంది. త్వరలోనే రేషన్ కార్డుల జారీకి కీలక నిర్ణయం తీసుకోనుంది.
తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల క్రితం ఆరు గ్యారంటీల అర్హుల ఎంపిక కోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో రేషన్ కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇందులో 19 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. తాజాగా వాటి పరిశీలనపై దృష్టిపెట్టింది. దరఖాస్తు చేసుకోనివారు ఉంటే రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులందరికీ రేషన్ కార్డు ఇస్తామని చెబుతోంది.ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉంది.
ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక సమాచారం వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ అవుతుందని తెలిపారు. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 17 స్థానాలకు గాను 14 సీట్లు దక్కించుకోవాలని ఫిక్స్ అయ్యింది.