Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై మరోసారి డిస్కౌంట్స్!

Traffic Challans: గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై రాయితీలు ప్రకటించాలని తెలంగాణ పోలీసు శాఖ యోచిస్తోంది. భారీ రాయితీలు ప్రకటించి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న చలాన్ల సంఖ్యను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం. కాగా గత ఏడాది ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ప్రకటించడం మంచి ఫలితాలను ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న చలాన్‌ల రూపంలో రూ.300 కోట్ల వరకు జరిమానాలు వసూలు చేశారు. నవంబర్ 2023 […]

Published By: HashtagU Telugu Desk
Technical Glitches

Traffic

Traffic Challans: గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై రాయితీలు ప్రకటించాలని తెలంగాణ పోలీసు శాఖ యోచిస్తోంది. భారీ రాయితీలు ప్రకటించి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న చలాన్ల సంఖ్యను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం. కాగా గత ఏడాది ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ప్రకటించడం మంచి ఫలితాలను ఇచ్చింది.

పెండింగ్‌లో ఉన్న చలాన్‌ల రూపంలో రూ.300 కోట్ల వరకు జరిమానాలు వసూలు చేశారు. నవంబర్ 2023 చివరి నాటికి, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న చలాన్‌ల సంఖ్య రెండు కోట్లకు చేరుతుందని అంచనా. ఈ సంఖ్యను వీలైనంత తగ్గించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది. నిర్ణీత వ్యవధిలోగా చలాన్లు చెల్లించే వారికి మరో రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉండగా.. ప్రత్యేక రాయితీ ప్రకటించడంతో పలువురు వాహనదారులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Kurnool: కర్నూలు రైతులపై కరువు ప్రభావం, మామిడి సాగుపై ఆశలు!

  Last Updated: 22 Dec 2023, 11:12 AM IST