Site icon HashtagU Telugu

MMTS Trains : ఎంఎంటీఎస్ ట్రైన్స్ ప్రయాణికులకు తీపికబురు

MMTS Trains

MMTS Trains

MMTS Trains : హైదరాబాద్‌లో నిత్యం ఎంతోమంది ఎంఎంటీఎస్ ట్రైన్ల సేవలను వినియోగిస్తుంటారు. నగర శివార్ల వరకు అందుబాటులో ఉండటంతో ఎంఎంటీఎస్ సర్వీసులకు సిటీలో మంచి క్రేజ్ ఉంది. ఛార్జీలు తక్కువ.. వేగం ఎక్కువ ఉండటం వీటిలో అతిపెద్ద అడ్వాంటేజ్. అయితే అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లను నడపకపోవడం ఒక్కటే మైనస్ పాయింట్‌గా మిగిలింది. ఈ మైనస్‌ను కూడా తొలగించే దిశగా రైల్వేశాఖ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లను నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే యోచిస్తోందట. అంటే ఇక ఎంఎంటీఎస్‌లు మనకు రోజూ 24 గంటలు అందుబాటులో ఉంటాయి.  ప్రస్తుతానికి రాత్రి 10.30 వరకు మాత్రమే ఎంఎంటీఎస్ ట్రైన్లు నడుస్తున్నాయి. దీంతో అర్ధరాత్రి తర్వాత ఎంఎంటీఎస్‌లను ఆశ్రయించేవారికి నిరాశే ఎదురవుతోంది. ఇక నుంచి ఆ బాధలు తప్పే అవకాశం ఉంది.

We’re now on WhatsApp. Click to Join

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం, బెంగళూరు, తిరుపతి మధ్య నడుస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ల  వేళలకు అనుగుణంగా ఎంఎంటీఎస్‌లను(MMTS Trains) అందుబాటులోకి తెచ్చే దిశగా రైల్వే అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. విశాఖ, తిరుపతి, బెంగళూరు నుంచి నగరానికి వచ్చే వందేభారత్‌ ట్రైన్లన్నీ రాత్రి 11 గంటల తర్వాతే వస్తున్నాయని.. అప్పుడు నగరంలో ప్రజారవాణా లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారనే విషయం రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ టైంలోనూ ఎంఎంటీఎస్‌లను నడపాలని ఆలోచిస్తున్నారట.  విజయవాడ – లింగంపల్లి మధ్య తిరిగే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ కూడా రాత్రి 10.30 తర్వాతే సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. అయితే ఇది లింగంపల్లి వరకూ వెళ్తున్నా.. అన్ని స్టేషన్లలో ఆగదు. కాబట్టి ఈ సమయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎంఎంటీఎస్‌లను నడిపే వేళలను పెంచనున్నారు. ఉదయం 4 గంటల నుంచి లింగంపల్లి, ఫలక్‌నుమా, హైదరాబాద్‌ నుంచి ఎంఎంటీఎస్‌లు నడిచేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.  ఈ అంశంపైనా సౌత్ సెంట్రల్ రైల్వే  సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం.

Also Read :CAA : సీఏఏ అంటే ఏంటి? దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసనలెందుకు జరిగాయి?

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. నెక్లెస్ రోడ్డు వేదికగా 22 కొత్త బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. కాగా అద్దె ప్రాతిపదికన తీసుకోనున్న మొత్తం 500 బస్సులు ఆగస్టు నాటికి అందుబాటులోకి రానున్నాయి. 22 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చిన TSRTC. మహాలక్ష్మి స్కీమ్ కింద నడవనున్న నాన్ ఏసి ఎలక్ట్రిక్ బస్సులు. ఈ బ‌స్సుల్లో కూడా మ‌హిళ‌లు ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని అధికారులు తెలిపారు.