మందుబాబులుకు గుడ్ న్యూస్.. త్వరలో 600కి పైగా కొత్త మద్యం బ్రాండ్లు

ప్రపంచంలో కొన్ని వేల రకాల మద్యం బ్రాండ్స్ ఉన్నాయి. కానీ మందుబాబులు ఎక్కువగా తాగేది బీరే. కొంతమంది కొత్త వరైటీలు టేస్ట్ చూస్తారు. తెలంగాణలో మద్యం ప్రియులు ఈమధ్య బాగా యాక్టివ్ అయ్యారు. వారు రొటీన్ సరుకు వద్దంటున్నారు. కొత్త బ్రాండ్లు, విదేశీ బ్రాండ్లు కావాలంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం.. వారి కోరిక తీర్చేందుకు.. తెలంగాణలో కొత్త బ్రాండ్లను రానివ్వాలని డిసైడ్ అయ్యింది. ఇలా ప్రభుత్వం దరఖాస్తులకు ఆహ్వానించగానే.. అలా 604 కొత్త మద్యం బ్రాండ్లు […]

Published By: HashtagU Telugu Desk
New Liquor Brands

New Liquor Brands

ప్రపంచంలో కొన్ని వేల రకాల మద్యం బ్రాండ్స్ ఉన్నాయి. కానీ మందుబాబులు ఎక్కువగా తాగేది బీరే. కొంతమంది కొత్త వరైటీలు టేస్ట్ చూస్తారు. తెలంగాణలో మద్యం ప్రియులు ఈమధ్య బాగా యాక్టివ్ అయ్యారు. వారు రొటీన్ సరుకు వద్దంటున్నారు. కొత్త బ్రాండ్లు, విదేశీ బ్రాండ్లు కావాలంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం.. వారి కోరిక తీర్చేందుకు.. తెలంగాణలో కొత్త బ్రాండ్లను రానివ్వాలని డిసైడ్ అయ్యింది. ఇలా ప్రభుత్వం దరఖాస్తులకు ఆహ్వానించగానే.. అలా 604 కొత్త మద్యం బ్రాండ్లు తెచ్చేందుకు కంపెనీలు అప్లై చేసేసుకున్నాయి. ఇక సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే లేటు.
ఒకప్పుడు క్వాలిటీ లేని మద్యం తాగితే.. ఫ్యాటీ లివర్ సహా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి అని మందుబాబులు భావించేవారు. ఇప్పుడు క్వాలిటీ మద్యం తాగితే.. పెద్దగా సమస్యేమీ ఉండదు అనే అభిప్రాయంతో ఉన్నారు. పైగా.. క్వాలిటీ మద్యం కాస్త ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. అది ఎక్కువగా తాగే పరిస్థితి ఉండదనీ.. అందువల్ల అనారోగ్యాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి అని మందుబాబులు భావిస్తున్నారు. కానీ.. ఇవన్నీ అపోహలే. మద్యం కొద్దిగా తాగినా సమస్యే. కానీ ఈ రోజుల్లో చాలా మంది మద్యం తాగుతున్నారు. మహిళలు కూడా తాగుతున్నారు. అందరూ కలిసి ఇళ్లలో సిట్టింగ్ పెట్టుకొని మరీ పెగ్గులేస్తున్నారు. ఇదో సామాజిక స్టేటస్ లాగా భావిస్తున్నారు. అందుకే.. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్, బీపీ కంటే.. ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి కేసులు పెరుగుతున్నాయి.
తెలంగాణలో 92 కంపెనీలు.. కొత్త మద్యం బ్రాండ్లను తెస్తామని చెబుతున్నాయి. దీనిపై ఇదివరకు విమర్శలు రావడంతో.. ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. కానీ రాన్రానూ ఖజానాకి మరింత డబ్బు కావాల్సి వస్తోంది. అందువల్ల కొత్త బ్రాండ్లను అనుమతిస్తే.. సేల్స్ పెరిగి.. ఖజానా గలగలలాడుతుందని సర్కార్ ఆలోచిస్తోంది. అందువల్ల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయిపోయాక.. గేట్లు తెరవాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది. అంటే.. మార్చి లేదా ఏప్రిల్‌లో కొత్త మద్యం బ్రాండ్లు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. ఇక అప్పుడు చూడాలి.. మందుబాబుల ఆనందం… మామూలుగా ఉండదు.
  Last Updated: 21 Feb 2026, 03:48 PM IST