TET Notification : వారంలో టెట్‌ నోటిఫికేషన్‌.. ఆ 2.20 లక్షల మందికి ఛాన్స్

TET Notification : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఎప్పుడు జరగబోతోంది అనే దానిపై క్లారిటీ వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
TS TET 2023

Tet Notification

TET Notification : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఎప్పుడు జరగబోతోంది అనే దానిపై క్లారిటీ వచ్చింది. సెప్టెంబర్‌ మూడోవారంలో ఈ ఎగ్జామ్ ను  నిర్వహించాలని రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ) నిర్ణయించింది. వారం రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్‌ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్‌ నిర్వహణపై అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. సెప్టెంబర్‌ 15కు ముందు లేదా తర్వాత ఎప్పుడైనా టెట్ నిర్వహించాలని భావిస్తున్నారు.

Also read : Cricket Schedule: ఆసియా క్రీడల్లో టీమిండియా షెడ్యూల్ ఇదేనా..?

టెట్‌ క్వాలిఫై కానివారు 2 లక్షల మంది..   

గతంలో టెట్‌కు(TET Notification)  7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్‌ వ్యవధిని జీవితకాలం పాటు పొడిగించారు. గతంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్‌ వారికే ఇవ్వగా, ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు. దీంతో గతంలో టెట్‌ క్వాలిఫై అయిన వారితో పాటు బీఈడీ అభ్యర్థులకు ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల మంది టెట్‌ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకుంటారు. తాజా టెట్‌ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కుతుంది.

Also read : Telangana Floods : తెలంగాణలో వరదల బీభత్సానికి 17 మంది మృతి

  Last Updated: 29 Jul 2023, 07:46 AM IST