New Underpass And Flyover : ట్రాఫిక్ కష్టాలకు చెక్.. హైదరాబాద్‌లో మరో అండర్ పాస్, ఫ్లైఓవర్

New Underpass And Flyover : హైదరాబాద్ మహా నగరంలో మరో అండర్‌పాస్ నిర్మాణానికి సీఎం రేవంత్ సర్కార్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - February 5, 2024 / 03:39 PM IST

New Underpass And Flyover : హైదరాబాద్ మహా నగరంలో మరో అండర్‌పాస్ నిర్మాణానికి సీఎం రేవంత్ సర్కార్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు దాటి, రోడ్డు నెంబర్‌–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా వరకు వెళ్లడానికి అండర్‌పాస్‌ నిర్మించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కేబీఆర్‌ పార్కులో ఒక్క చెట్టుకు హానీ జరగకుండా గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అథారిటీకి లోబడి 1.5 కిలోమీటర్ల మేర ఈ అండర్‌పాస్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీర్లను అధికారులు ఆదేశించారు. ఈ అండర్ పాస్ ద్వారా బాలకృష్ణ ఇంటివైపు, ఫిలింనగర్‌ వైపు, రోడ్డు నెంబర్‌–45 వైపు వాహనదారులు కేబీఆర్‌ పార్కు నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫ్రీగా ముందుకు వెళ్లొచ్చు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌–45 బాలకృష్ణ ఇంటి చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మీదుగా బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కు వరకు వన్‌వేలో వెళ్లేందుకు ఫ్లైఓవర్‌(New Underpass And Flyover)  నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు కిలోమీటరు మేర ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌–45 కేబుల్‌ బ్రిడ్జి ఫ్లైఓవర్‌ నుంచి వాహనాలు కిందికి వచ్చాక.. ఆ వెంటనే కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ మీదుగా బంజారాహిల్స్‌ వైపు వాహనదారులు వెళ్లేందుకు అనువుగా ఈ నిర్మాణం చేపట్టేందుకు డిజైన్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

కేబీఆర్‌ పార్కు జంక్షన్, జూబ్లీహిల్స్‌ జంక్షన్, జర్నలిస్ట్‌ కాలనీ జంక్షన్, జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌–45 జంక్షన్, సీవీఆర్‌ న్యూస్‌ జంక్షన్, బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–12 అగ్రసేన్‌ జంక్షన్లలో ఇరుకుగా ఉన్న సెంట్రల్‌ మీడియన్లను కొంతమేర తగ్గించాలని సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నాలుగువైపులా వెహికల్స్ తేలిగ్గా వెళ్లేందుకు వీలుగా ఈ సెంట్రల్‌ మీడియన్లను కట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు.కేబీఆర్‌ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్‌ చౌరస్తా మీదుగా ఫిలింనగర్‌ వెళ్లే వాహనాలు జూబ్లీహిల్స్‌ జంక్షన్‌ మలుపు వద్ద భారీ హైటెన్షన్‌ స్తంభాలు ఫుట్‌పాత్‌పై అడ్డుగా ఉన్నాయి. అక్కడ హైటెన్షన్‌ స్తంభాలను తొలగించి ఫుట్‌పాత్‌ వెడల్పును తగ్గించటం ద్వారా ఫిలింనగర్‌ వైపు ప్రీలెఫ్ట్‌లో వాహనదారులు తేలికగా వెళ్లేందుకు వీలు ఉటుందని నిర్ణయించారు. ఇక కేబీఆర్‌ పార్కు చుట్టూ ఉన్న పార్కింగ్‌ స్థలాల్లో మల్టీ లెవల్ పార్కింగ్‌ సౌకర్యాలు కల్పించాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నిర్మాణాల కోసం అంతకుముందు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టుతో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌–45, రోడ్డు నెంబర్‌–36తో పాటు జర్నలిస్ట్‌ కాలనీ చౌరస్తా, సీవీఆర్‌ న్యూస్‌ చౌరస్తా, అగ్రసేన్‌ చౌరస్తా, విరించి హాస్పిటల్‌ చౌరస్తా, కేబీఆర్‌ పార్కు చౌరస్తాల్లో ట్రాఫిక్‌పై అధికారులు సర్వే చేశారు.

Also Read :3 Temples : శాంతియుతంగా ఆ రెండూ అప్పగిస్తే.. అన్నీ మర్చిపోతాం : గోవింద్ దేవ్‌గిరి మహారాజ్