తెలంగాణలో పదవ తరగతి చదివే విద్యార్థులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈ ఏడాదిలో కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాక ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. విద్యాశాఖ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. కోవిడ్ ముందు రాష్ట్రంలో పదవ తరగతి కి సంబంధించి మొత్తం 11 పేపర్లు ఉండేవి. కోవిడ్ కారణంగా వాటిని 6 పేపర్లకు తగ్గించింది.
తరగతులు సరిగ్గా జరకపోవడం, సిలబస్ పూర్తికాకపోవడంతో…ఈ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. అయితే ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కోవిడ్ తీవ్రరూపం దాల్చడంతో నిర్వహించలేదు. 2022లో 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది కూడా 2023లో నిర్వహించనున్న పరీక్షలకు కూడా 6 పేపర్లతోనే నిర్వహించాలని సర్కార్ డిసైడ్ అయ్యింది. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఊరట లభించినట్లయ్యింది.