Site icon HashtagU Telugu

Trains Extension : 3 ఎక్స్‌ప్రెస్‌ లు, ఒక ప్యాసింజర్‌ ట్రైన్ హాల్టింగ్ స్టేషన్లు పొడిగింపు

Train Tickets

17 Trains Cancelled

Trains Extension : తెలంగాణ నుంచి నడిచే 3 ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్స్, ఒక లోకల్ ప్యాసింజర్‌ ట్రైన్  ఫైనల్ హాల్టింగ్ స్టేషన్లను రేపటి ( అక్టోబరు 9)  నుంచి పొడిగించనున్నారు.  ప్రస్తుతం జైపూర్‌ నుంచి కాచిగూడ వరకు నడుస్తున్న జైపూర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ను ఏపీలోని కర్నూలు సిటీ వరకు పొడిగించారు. కర్నూలు రూట్ లో తెలంగాణలోని గద్వాల, మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌ లలో కూడా ఈ ట్రైన్ ఆగనుంది. దీంతో ఈ ప్రాంతాల ప్రజలు నేరుగా పింక్‌సిటీ జైపూర్‌కు వెళ్లేందుకు ఛాన్స్ కలుగుతుంది. ఇక హడప్సర్‌ (పుణె) నుంచి హైదరాబాద్‌ వరకు నడుస్తున్న హడప్సర్‌ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ను  భువనగిరి, జనగామ మీదుగా కాజీపేట వరకు పొడిగించారు.

We’re now on WhatsApp. Click to Join

దీంతోపాటు హెచ్‌ఎస్‌ నాందేడ్‌  నుంచి తాండూరు మధ్య నడుస్తున్న  పర్భణీ డైలీ ఎక్స్‌ప్రెస్‌ ను సేడం, యాద్గిర్‌ మీదుగా రాయచూరు వరకు పొడిగించారు.  కరీంనగర్‌  నుంచి నిజామాబాద్‌  వరకు నడుస్తున్న కరీంనగర్‌ డైలీ ప్యాసింజర్‌ ను బోధన్‌ వరకు నడపనున్నారు. హాల్టింగ్ స్టేషన్లను పొడిగించడం ద్వారా ఆయా ప్రాంతాల ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని దక్షిణ మధ్య రైల్వే (Trains Extension)  వెల్లడించింది. ఈ రైళ్ల పొడిగింపును సోమవారం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపింది.

Also read : Petrol Diesel Rate: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. విజయవాడలో మారిన ధరలు..!