Anganwadi : అంగన్వాడీలకు శుభవార్త తెలిపిన మంత్రి సీతక్క

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందించనున్నుట్ల వెల్లడించారు. ‘అమ్మ మాట- అంగన్వాడీ బాట’లో భాగంగా హైదరాబాద్‌ రహమత్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.

Published By: HashtagU Telugu Desk
Good News Anganwadi workers 2024: minister-seethakka

Good News Anganwadi workers 2024: minister-seethakka

Anganwadi: రాష్ట్రంలొని అంగన్వాడీ కేంద్రాలలో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలకు మంత్రి సీతక్క(Minister Sitakka) శుభవార్తల ప్రకటించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందించనున్నుట్ల వెల్లడించారు. ‘అమ్మ మాట- అంగన్వాడీ బాట’లో భాగంగా హైదరాబాద్‌ రహమత్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

నామమాత్రపు వేతనంతో సేవలందిస్తున్న అంగన్వాడీ(Anganwadi) సిబ్బంది కష్టాలు ప్రభుత్వానికి తెలుసని మంత్రి చెప్పారు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని, రెండు మూడు రోజుల్లో ఈమేరకు జీవో విడుదల చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

కాగా, తెలంగాణ(Telangana)లోని అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో కొనసాగుతున్న సుమారు 15 వేల అంగన్వాడీ కేంద్రాలను తొలిదశలో ఉన్నతీకరిస్తున్నది. వాటిని పూర్వ ప్రాథమిక విద్య (ప్రీప్రైమరీ) పాఠశాలలుగా తీర్చిదిద్దుతున్నది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే వాటిని అందుబాటలోకి తీసుకొచ్చింది.

Read Also: KTR : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందే : కేటీఆర్

 

  Last Updated: 16 Jul 2024, 02:08 PM IST