Gold Price Today : భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో బంగారం, వెండికి ఉన్న ప్రత్యేకత మాటల్లో చెప్పలేనిది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగల సందర్భాల్లో బంగారం మనకు ముందుగా గుర్తొస్తుంది. వందల ఏళ్లుగా బంగారు ఆభరణాలు ధరించడం భారతీయ జీవన విధానంలో భాగమైపోయింది. మహిళలతో పాటు పురుషులూ నగలను ధరిస్తూ వస్తున్నారు. ఈ మహత్తర సంప్రదాయానికి తోడు, బంగారం పెట్టుబడిగా కూడా ఎంతోమంది దృష్టిని ఆకర్షిస్తోంది.
గోల్డ్, సిల్వర్ డిమాండ్ పెరుగుతుండటం
గడచిన కాలంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వెండికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం వెండి ఆభరణాలకు కూడా క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో, గోల్డ్, సిల్వర్ రేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అవసరం. 2025 ప్రారంభం తర్వాత తొలిసారి బంగారం ధరలు తగ్గడం, ఆ ధరలు వరుసగా మూడో రోజూ స్థిరంగా కొనసాగడం కొనేందుకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ధరలు మళ్లీ పెరగక ముందే కొనుగోలుకు సిద్ధం కావడం మంచిది.
Morning Habits : రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే 7 ఉదయం అలవాట్లు
అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్ రేట్లు
అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. క్రితం రోజుతో పోలిస్తే, బంగారం ధర 10 డాలర్ల వరకు పెరిగి, స్పాట్ గోల్డ్ ఔన్సు రేటు 2,648 డాలర్లకు చేరింది. వెండి ధరలు కూడా ఔన్సుకు 30 డాలర్లకు పైగా పెరిగాయి. స్పాట్ రూపాయి మారకం విలువ తగ్గి, డాలర్‌తో పోలిస్తే రూ. 85.815 వద్ద ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్లు
హైదరాబాద్ మార్కెట్లో వరుసగా మూడో రోజూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి:
22 క్యారెట్ల బంగారం: రూ. 72,150 (పది గ్రాములకు)
24 క్యారెట్ల బంగారం: రూ. 78,710 (పది గ్రాములకు)
ఢిల్లీ మార్కెట్లో:
22 క్యారెట్ల బంగారం: రూ. 72,300
24 క్యారెట్ల బంగారం: రూ. 78,860
వెండి ధరలు మళ్లీ లక్ష మార్క్
హైదరాబాద్‌లో వెండి రేటు మళ్లీ లక్ష మార్క్ దాటింది. కిలో వెండి ధర ఇవాళ రూ. 1,000 పెరిగి రూ. 1 లక్ష వద్ద ట్రేడవుతోంది.
దిల్లీ మార్కెట్లో కూడా వెండి ధర రూ. 92,500 వద్ద కొనసాగుతోంది.
ధరల్లో మార్పులు & కొనుగోలు ముందు జాగ్రత్తలు
పైన పేర్కొన్న ధరలు జీఎస్టీ, ఇతర ఛార్జీలను కలుపకుండా ఉన్నాయి. ట్యాక్సులు, ఛార్జీలు కలిపితే బంగారం, వెండి రేట్లలో వ్యత్యాసాలు రావచ్చు. ఇవి బుధవారం ఉదయం 7 గంటల వరకు ఉన్న ధరలు. మధ్యాహ్నం లేదా తరువాత ఈ రేట్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కొనుగోలు చేయడానికి ముందు స్థానికంగా తాజా రేట్లు తెలుసుకోవడం మంచిది.
Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ