Site icon HashtagU Telugu

Gold Price : బంగారం వెండి ధరలు కొత్త రికార్డు.. పసిడి ప్రియులకు షాక్

Gold Price

Gold Price

Gold Price : బంగారం ధరలు పసిడి ప్రియులను గజగజ వణికిస్తున్నాయి. వరుసగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్న ఈ ధరకలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నేడు మరోసారి బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగి షాక్ ఇచ్చాయి. ఒక్కరోజులోనే తులం బంగారం ధర రూ.1,640 పెరగడం వినియోగదారులను తీవ్రంగా ఆశ్చర్యపరిచింది. వెండి కూడా అదే దారిలో సాగుతూ ధరలను పెంచుకుంది. కిలో వెండి ధర నేడు రూ.1,100 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.10,495 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.9,620 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల ధరల్లోనూ భారీ పెరుగుదల నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,500 పెరిగి రూ.96,200కి చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,640 పెరిగి రూ.1,04,950 వద్ద అమ్ముడవుతోంది. విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

TG Assembly Session : రేపటి నుంచి అసెంబ్లీ.. కేసీఆర్ వస్తారా?

దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.96,350కి చేరగా, 24 క్యారెట్ల బంగారం రూ.1,05,100 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరల్లోనూ పెరుగుదల కొనసాగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,31,000కి చేరగా, ఢిల్లీలో కిలో వెండి రూ.1,21,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒకే రోజులో బంగారం, వెండి ధరలు ఇంత భారీగా పెరగడం వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలని చూసే కుటుంబాలు ఇలాంటి ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన కూడా పెరుగుతోంది. దీంతో పసిడి ప్రియులు ఇప్పుడు కొనుగోలు నిర్ణయంపై ఆలోచనలో పడిపోయారు.

Kotamreddy Sridhar Reddy : TDP MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర?