Gold Price : అమెరికా వాణిజ్య విధానాలు, ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాల ప్రభావం భారతీయ బంగారు అభరణాల మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని వారాలుగా బంగారం ధరలు తీవ్ర మార్పులతో కదులుతున్నాయి—ఒక రోజు తగ్గినా, మరుసటి రోజు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ధరలు స్వల్పంగా తగ్గినా తులం బంగారం లక్ష రూపాయలకుపైగానే ఉండటం వల్ల సాధారణ కొనుగోలుదారులు కొనలేని స్థితి ఏర్పడింది.
Healty Fruit : మెదడు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు చేకూర్చే ఫలం.. ట్రై చేసి చూడండి
వెండి కూడా అంతే. బంగారం ధరలు పెరిగే కొద్దీ వెండి కూడా అందనంత ఎత్తుకి చేరుతోంది. కొందరు నిపుణులు రాబోయే రోజుల్లో వెండి కొంత చౌకగా మారవచ్చని చెప్పినా, ప్రస్తుత ధోరణి చూస్తే అది కూడా లక్ష రూపాయలకుపైగానే కొనసాగుతుందని సూచిస్తోంది. ముఖ్యంగా GST జోడించకుండానే బంగారం ఇప్పటికే రూ.1 లక్ష దాటింది.
ప్రధాన నగరాల్లో తాజా బంగారం ధరలు (10 గ్రాములకు)
- చెన్నై: 24 క్యారెట్లు – ₹1,01,340; 22 క్యారెట్లు – ₹92,890
- ఢిల్లీ: 24 క్యారెట్లు – ₹1,01,490; 22 క్యారెట్లు – ₹93,040
- ముంబై: 24 క్యారెట్లు – ₹1,01,340; 22 క్యారెట్లు – ₹92,890
- హైదరాబాద్: 24 క్యారెట్లు – ₹1,01,340; 22 క్యారెట్లు – ₹92,890
- విజయవాడ: 24 క్యారెట్లు – ₹1,01,340; 22 క్యారెట్లు – ₹92,890
- బెంగళూరు: 24 క్యారెట్లు – ₹1,01,340; 22 క్యారెట్లు – ₹92,890
- వెండి ధర: కిలోకు ₹1,12,900
ధరల పెరుగుదల వెనుక కారణాలు
గ్లోబల్ మార్కెట్లో డాలర్ బలపడటం బంగారం ధరలపై ఒత్తిడిని సృష్టించింది. సుంకాలు, వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో పెట్టుబడిదారులు బంగారం, వెండిని ‘సురక్షిత పెట్టుబడి’గా చూసి కొనుగోళ్లు పెంచుతున్నారు. అనిశ్చిత పరిస్థితుల్లో విలువైన లోహాలపై డిమాండ్ పెరిగింది.
గత 20 ఏళ్లలో బంగారం, వెండి రాబడులు.. 2005లో 10 గ్రాముల బంగారం ధర కేవలం ₹7,638 మాత్రమే. 2025 ఆగస్ట్ 4 నాటికి అదే బంగారం ధర ₹1 లక్ష దాటింది. వెండి కూడా కిలోకు ₹1 లక్షను మించి కొనసాగుతోంది. ఈ గణాంకాలు చూస్తే, బంగారం, వెండి దీర్ఘకాలిక పెట్టుబడిగా అద్భుతమైన రాబడిని అందించాయని స్పష్టమవుతోంది.
Prakasam District: వింత ఆచారం.. అక్కడ వధువు అబ్బాయి, వరుడు అమ్మాయి..ఎందుకో తెలుసా..?