Gold Price Today : భారతదేశంలో బంగారానికి ఉన్న ప్రత్యేకత మరెవరికీ తెలియజెప్పనవసరం లేదు. ముఖ్యంగా మహిళల కోసం బంగారాన్ని ఆభరణంగా మాత్రమే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తున్నారు. పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సందర్భాల్లో బంగారం కొనుగోలు తప్పనిసరి. ఈ డిమాండ్ వల్ల బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావానికి అనుగుణంగా ఉంటాయి. అక్కడ ధరలు పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతాయి. స్థిరంగా ఉంటే ఇక్కడా స్థిరంగానే కొనసాగుతాయి.
అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్, సిల్వర్ రేట్లు
ప్రస్తుతం గోల్డ్ ధరలు మరల పెరుగుదల చూపుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2716 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతోంది. చాలా రోజుల తరువాత 2700 డాలర్ల మార్కును దాటింది. స్పాట్ సిల్వర్ కూడా 30.84 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ పతనం కొనసాగుతుండడంతో, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.65 వద్ద ఉంది.
దేశీయ మార్కెట్ ధరలు
హైదరాబాద్‌లో:
22 క్యారెట్లు: ఒక్కరోజులో రూ. 500 పెరిగి రూ. 73,900.
24 క్యారెట్లు: రూ. 550 పెరిగి రూ. 80,620.
ఇదే ధరలు విజయవాడలో కూడా ఉన్నాయి.
ఢిల్లీలో:
22 క్యారెట్లు: రూ. 500 పెరిగి రూ. 74,050.
24 క్యారెట్లు: రూ. 550 పెరిగి రూ. 80,770.
వెండి ధరల పెరుగుదల
హైదరాబాద్: కేజీ వెండి ధర రూ. 2,000 పెరిగి రూ. 1.03 లక్షల వద్ద ఉంది.
ఢిల్లీ: రూ. 2,000 పెరిగి రూ. 95,500.
తాజా ట్రెండ్‌పై ఓ వాఖ్య
బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడి మారుతుంటాయి. ఇలాంటి స్థితిలో ధరలపై నిశితంగా దృష్టి సారించడం పెట్టుబడిదారులకు ఆవశ్యకమని చెప్పవచ్చు.