Gold Price Today : పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలంటే బంగారం కొనుగోలు అనేది సంప్రదాయంగా మారిపోయింది. ఇది అందానికిగా, ఆర్థిక భద్రతకూ ప్రతీకగా నిలుస్తోంది. అలాగే వెండికీ మంచి డిమాండ్ ఉంది. అందువల్ల, బంగారం, వెండి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అవసరం.
తాజా బంగారం ధరల్లో పెరుగుదల
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ తరువాత ఒక్కరోజు తగ్గిన బంగారం ధరలు, ఆపై మళ్లీ పెరుగుతూ వచ్చాయి. గత మూడు రోజుల్లోనే తులానికి రూ.2500 పెరిగి కొత్త రికార్డులను నెలకొల్పింది. బులియన్ మార్కెట్ వర్గాల ప్రకారం, అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు, ఆర్థిక అనిశ్చితి, బంగారం డిమాండ్ వంటి అనేక అంశాలు ధరల పెరుగుదలకు కారణంగా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు
ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2860 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ రేటు 32.24 డాలర్లుగా ఉంది. మరోవైపు, ఇండియన్ రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.87.648 వద్ద ఉంది.
ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు (ఫిబ్రవరి 7)
హైదరాబాద్:
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) – ₹79,300 (+₹250)
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) – ₹86,510 (+₹270)
విజయవాడ :
22 క్యారెట్లు – ₹79,300 (+₹250)
24 క్యారెట్లు – ₹86,510 (+₹270)
విశాఖపట్నం :
22 క్యారెట్లు – ₹79,300 (+₹250)
బిస్కెట్ బంగారం (24 క్యారెట్లు) – ₹86,510 (+₹270)
వెండి ధరలు
బంగారం ధరల పెరుగుదలతో పాటు వెండి రేట్లు కూడా పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర ₹1,07,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
ఈ రేట్లు ఫిబ్రవరి 7 ఉదయం 7 గంటల వరకు ఉన్నవి. మధ్యాహ్నం తర్వాత మార్పులు సంభవించవచ్చు. బంగారం, వెండి కొనుగోలు చేయేముందు తాజా ధరలను సరిచూసుకోవడం మంచిది.
AP Ministers Ranks : ఏపీ మంత్రులకు ర్యాంకులు.. చంద్రబాబు, పవన్, లోకేశ్‌కు ఎంతంటే..?