Gold Price Today : భారతీయుల కోసం బంగారం ఎంతో ప్రీతిపాత్రమైన లోహం. పండగలు, శుభకార్యాలు, ప్రత్యేక వేడుకల సమయంలో దీని డిమాండ్ మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలను అందాన్ని మెరుగుపరిచే అలంకారంగా భావిస్తారు. కానీ ఇటీవల బంగారం కొనుగోలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధరలు భారీగా పెరుగుతూ కొత్త గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఇటీవల వరుసగా రెండు రోజుల పాటు తగ్గినా, ఆపై ఒక్క రోజులోనే మళ్లీ భారీగా పెరిగాయి. తాజా పెరుగుదలతో బంగారం రేటు జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగానే ట్రేడ్ అవుతున్నాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2,761.80 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు 30.86 డాలర్ల వద్ద ఉంది. మరోవైపు, రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే ₹86.668 వద్ద స్థిరపడింది. ఇది ఇప్పటివరకు కనిష్ఠ స్థాయిలో ఉంది.
Sunita Williams : సునితా విలియమ్స్‌ను భూమికి తీసుకురండి.. ట్రంప్ ఆదేశం.. మస్క్ ప్రకటన
దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు
భారతదేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ఒక్కరోజులో ₹850 పెరిగి తులానికి ₹75,950కి చేరుకుంది. గత రెండు రోజుల్లో వరుసగా ₹300, ₹150 తగ్గినప్పటికీ, తాజా పెరుగుదలతో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరిగింది. ఒక్కరోజులో ₹920 పెరిగి 10 గ్రాములకు ₹82,850కి చేరుకుంది.
ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు హైదరాబాద్ కంటే ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం ధర ₹850 పెరిగి తులానికి ₹76,100కి చేరుకుంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ₹920 పెరిగి ₹83,000 మార్క్‌ను దాటింది.
వెండి ధరలు స్థిరంగా
ఇక వెండి ధరలు మాత్రం పెద్దగా మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర ₹96,500 వద్ద ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ₹1.04 లక్షలుగా ఉంది. సాధారణంగా వెండి ధర ఢిల్లీలో కంటే హైదరాబాద్‌లో ఎక్కువగా ఉంటుందనే విషయం గమనించాలి.
ఇటీవల బంగారం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే మార్కెట్‌లోని మార్పులు, అంతర్జాతీయ పరిణామాలు బంగారం రేట్లపై ప్రభావం చూపుతాయి. ధరలు ఎలా మారతాయో చూడాలి!