Gold ATM: తెలంగాణలో ఏటీఎం నుంచి బంగారం..

ఏటీఎం (ATM) నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకున్నంత సులువుగా బంగారాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు.

బంగారాన్ని (Gold) కొనుగోలు చేసేందుకు దుకాణాలకే వెళ్లాల్సిన అవసరం లేదు ఇకపై ఏటీఎం నుంచి కూడా తీసుకోవచ్చు. ఏటీఎం (ATM) నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకున్నంత సులువుగా బంగారాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. గోల్డ్‌ సిక్కా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇటీవలే హైదరాబాద్‌లోని బేగంపేటలో గోల్డ్‌ (Gold) ఏటీఎం (ATM)ను ఏర్పాటు చేసింది. ఇది దేశంలోనే మొట్టమొదటి రియల్‌ టైమ్‌ గోల్డ్‌ డిస్పెన్సింగ్‌ మెషిన్‌. త్వరలో నగరంలోని గుల్జార్‌హౌస్‌, సికింద్రాబాద్‌, అబిడ్స్‌తోపాటు పెద్దపల్లి, వరంగల్‌, కరీంనగర్‌లలో గోల్డ్‌ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు గోల్డ్‌ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్‌ తరుజ్‌ చెప్పారు.

బంగారాన్ని ఏవిధంగా విత్‌డ్రా చేసుకోవాలి?

  • గోల్డ్ ఏటీఎం ఇతర క్యాష్‌ ఏటీఎం మాదిరిగానే పనిచేస్తుంది.
  • ముందుగా ఏటీఎంపై ‘క్లిక్‌ హియర్‌ టు బై గోల్డ్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి.
  • ఇప్పుడు మీరు ఎంత బంగారాన్ని కొనుగోలు చేయాలో ఎంచుకోవాలి. 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాములు ఇలా వివిధ ఆప్షలు అందుబాటులో ఉంటాయి. మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోవచ్చు.
  • ఆ తర్వాత మీరు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల్లో ఏ కార్డును ఉపయోగిస్తారో ఎంచుకోవాలి.
  • తర్వాత కార్డు ప్లేస్‌ చేసి పిన్‌ ఎంటర్‌ చేయాలి. కార్డు ఇన్సర్ట్‌ చేసే ముందు ‘స్టార్ట్‌ ట్రాన్జాక్షన్‌’ పై క్లిక్‌ చేయాలి.
  • లావాదేవీ విజయవంతమైన తర్వాత ఏటీఎం కింది భాగం నుంచి మీరు ఎంచుకున్న బరువుకు సంబంధించి గోల్డ్‌ కాయిన్‌ వస్తుంది. దీంతో పాటే నాణ్యత, బరువు తెలిపే సర్టిఫికెట్‌ కూడా వస్తుంది.
  • ఈ గోల్డ్‌ ఏటీఎం 24×7 అందుబాటులో ఉంటుంది. బడ్జెట్‌ అనుసరించి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
  • డెబిట్‌ కార్డు లేదా క్రెడిట్‌ కార్డును ఉపయోగించి గానీ, సంస్థ అందించే ప్రీపెయిడ్‌ కార్డులను ఉపయోగించి గానీ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
  • గోల్డ్‌ ఏటీఎం ద్వారా 99.99% స్వచ్ఛత ఉన్న బంగారాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు ATM స్క్రీన్‌పై కనిపిస్తాయి. ట్యాక్స్‌లు కూడా కలిపే ఉంటాయి.
  • ఒక వేళ లావాదేవీలు జరిగిన తర్వాత బంగారం కాయిన్‌ రాకపోతే 24 గంటల్లో మీ డబ్బు రీఫండ్‌ చేస్తారు. అలాగే కస్టమర్‌ కేర్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

Also Read:  Border Issue: కర్ణాటక మహారాష్ట్ర మధ్య ముదిరిన సరిహద్దు వివాదం..!