వేటకు (Hunting) వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుకున్న ఓ యువకుడి ఘటన తెలంగాణవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. కామారెడ్డి (Kamareddy) జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లాడు. అయితే వేటాడే క్రమంలో ఆ యువకుడు ఓ గుహలోకి వెళ్లాడు. ఏం జరిగిందో ఏమోకానీ గుహలోని బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. రాజు అనే వ్యక్తి మంగళవారం గుహలో రెండు రాళ్ల మధ్యలో పడిపోయాడు. దీంతో సాయం చేయాలని తీవ్రంగా రోదిస్తున్నాడు.
విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది రాళ్ల కింద కూరుకుపోయిన యువకుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బుధవారం రాత్రి కూడా తమ ప్రయత్నాలను కొనసాగించింది. ఎల్లారెడ్డి అటవీ ప్రాంతం (deep forest)లో చిక్కుకుపోయినట్టు సమాచారం. బయటకు తీయడానికి అటవీ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది 18 గంటలకు పైగా శ్రమించారు. యువకుడిని రక్షించేందుకు అధికారులు నాలుగు జేసీబీలతో బండరాళ్లను తొలగించారు. అయినా కూడా యువకుడు బయట పడలేదు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.
రాత్రంతా ఆపరేషన్ కొనసాగిందని రెస్క్యూ వర్కర్ తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు రక్షించే పనిలో ఉన్నందున ఓపికగా ఉండాలని ఆ యువకుడికి సూచించారు. రాజు కుటుంబ సభ్యులు అతని రక్షణ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అతని మొబైల్ ఫోన్‌లో అందుబాటులో లేకపోవడంతో అతని కోసం వెతకడం ప్రారంభించామని వారు చెప్పారు. ప్రస్తుతం గుహ(Cave) లో ఇరుక్కుపోయిన యువకుడి వీడియో వైరల్ అవుతోంది.
Also Read: Suguna Sundari Song: సుగుణ సుందరితో బాలయ్య మాస్ డ్యూయెట్!
https://twitter.com/KP_Aashish/status/1603240779094245376?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1603240779094245376%7Ctwgr%5E78f796255bc72d2a4cae56b8ada714b944d23a43%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.siasat.com%2Fvideo-operation-on-to-rescue-man-stuck-under-rocks-in-telanganas-kamareddy-2480231%2F