హైదరాబాద్ నగరానికి గ్లోబల్ కనెక్టివిటీ మరింతగా పెరగనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు(Shamshabad Airport)ను విస్తరించేందుకు జీఎంఆర్ (GMR) హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (GHIAL) భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విస్తరణకు అంచనా రూ.14,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విమాన రాకపోకలు మరియు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో, విస్తరణ అనివార్యమైందని వర్గాలు పేర్కొంటున్నాయి.
#Yogandhra 2025 : రెండు రోజుల పాటు వైజాగ్ లో స్కూల్స్ కు సెలవులు
ఈ విస్తరణ ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అలాగే మరో రన్‌వేను కూడా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల ఒకేసారి ఎక్కువ విమానాలు ల్యాండ్ అయ్యే అవకాశం కలుగుతుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం కల్పించేందుకు ఆధునిక సదుపాయాలు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ టెక్నాలజీ వంటివి ఈ ప్రాజెక్టులో భాగమవుతాయి.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్ష..తమిళనాట తీవ్ర చర్చ
ఈ విస్తరణ పనులు వచ్చే ఏడాది ప్రారంభించి 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తయిన తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్టు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద, ఆధునిక ఎయిర్‌పోర్టులలో ఒకటిగా మారే అవకాశముంది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఇది ఒక కీలక అడుగుగా భావించవచ్చు.