Site icon HashtagU Telugu

GMR School of Aviation : విమానాల నిర్వహణపై ఇంజినీరింగ్‌ కోర్సు.. జీఎంఆర్ ఏవియేషన్‌ స్కూల్‌ ఏర్పాటు

Gmr School Of Aviation

Gmr School Of Aviation

GMR School of Aviation : జీఎంఆర్‌ సంస్థ శంషాబాద్‌ విమానాశ్రయ ప్రాంగణంలో ఏవియేషన్‌ స్కూల్‌ను ఏర్పాటు చేసింది. విమానాల నిర్వహణ ఇంజినీరింగ్‌ (ఏఎంఈ) కోర్సును ప్రవేశపెట్టింది. ఈ నాలుగేళ్ల కోర్సు జూన్‌లో ప్రారంభమవుతుంది. ఇంటర్‌లో మ్యాథ్స్, భౌతిక, రసాయన శాస్త్రాలు చదివి 50 శాతం  మార్కులతో పాసైన విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించి పాసయ్యే వారిలో 200 మందికి ప్రవేశం కల్పిస్తారు. టీఎస్‌-ఎంసెట్‌, జేఈఈ మెయిన్స్‌లో పాసైన వారికి కూడా ఎంట్రెన్స్ కల్పిస్తారు. ఈ కోర్సు చేస్తే దేశ, విదేశాల్లోని విమానయాన సంస్థల్లో జాబ్స్ వస్తాయి. దక్షిణాసియాలో ఏర్పాటైన మొట్టమొదటి ఏవియేషన్‌ స్కూల్‌ ఇదేనని జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ అకౌంటబుల్‌ మేనేజర్‌, స్కూల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ గోపీనాథ్‌ చెప్పారు. ఈ కోర్సుకు భారత పౌరవిమానయాన సంస్థ డైరెక్టరేట్, ఐరోపా విమానయాన భద్రతా ఏజెన్సీ (యాసా) నుంచి అనుమతులు తీసుకున్నామని వెల్లడించారు. నాలుగేళ్ల కోర్సు తర్వాత విద్యార్థులకు పట్టాతో పాటు విమాన భద్రత ధ్రువీకరణ అధికారిగా లైసెన్సు(GMR School of Aviation) ఇస్తామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Coal Oven – 5 Deaths : బొగ్గుల కుంపటికి ఐదుగురు టీనేజర్లు బలి.. ఏమైందంటే ?

ఈ కుబేరులకు సొంతంగా జెట్ విమానాలు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సొంత జెట్ విమానాలు కలిగి ఉన్న కుబేరులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.  హాంకాంగ్ బిలియనీర్ జోసెఫ్ లా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్ విమానాన్ని కలిగి ఉన్నారు. ఈయన 367 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి బోయింగ్ 747-8 VIP విమానాన్ని కొన్నారు. ఈ విమానంలో మాస్టర్ బెడ్‌రూమ్, లాంజ్, ఆఫీసు, డైనింగ్ రూమ్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. రష్యన్ బిలియనీర్ అలిషర్ ఉమనోచ్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్ విమానం ఉంది. ఈయన A340-300 అనే ఎయిర్‌బస్‌ని 250 మిలియన్ డాలర్లు వెచ్చించి కొన్నారు. ఈ విమానం 375 మంది ప్రయాణికులను తీసుకువెళ్లగలిగే సామర్థం కలిగి ఉంది. బ్రూనై దేశ సుల్తాన్‌గా పిలవబడే బిలియనీర్ హసనల్ బొల్కియా వద్ద కూడా అత్యంత ఖరీదు చేసే విమానం ఉంది. ఈయన 747-430 బోయింగ్ విమానాన్ని 230 మిలియన్ డాలర్లు వెచ్చించి కొన్నారు.