Site icon HashtagU Telugu

Global Summit 2025 : రెండు రోజులకు సంబదించిన పూర్తి షెడ్యూల్ ఇదే !!

Telangana Global Summit Vis

Telangana Global Summit Vis

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో జరగనుంది. కేవలం రెండు రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం, రాష్ట్రాన్ని భవిష్యత్తు వైపు నడిపించడానికి రూపొందించిన అత్యంత సమగ్రమైన ప్రణాళికను ప్రపంచ వేదికపై ఆవిష్కరించనుంది. ఈ సమ్మిట్‌లో రాష్ట్రం యొక్క విజన్ 2047 ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇది రాబోయే రెండు దశాబ్దాలలో తెలంగాణ ఏ విధంగా రూపాంతరం చెందబోతుందో తెలియజేసే ఒక కీలకమైన ‘బ్లూప్రింట్’గా పనిచేస్తుంది. ఈ శిఖరాగ్ర సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం, స్థానిక ఆర్థికాభివృద్ధికి, అంతర్జాతీయ సహకారానికి మరియు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై లోతైన చర్చలను ప్రారంభించడం.

Mana Shankara Vara Prasad Garu : శశిరేఖ, ప్రసాద్ లవ్ సాంగ్ ప్రోమో అదిరిపోయిందిగా !!

సమ్మిట్ యొక్క ఎజెండాలో రాష్ట్ర పురోగతికి కీలకంగా భావించే ముఖ్య రంగాలపై ఫోకస్ చేసింది.ఒక్కో రంగంలో తెలంగాణ తన సామర్థ్యాన్ని, పెట్టుబడుల అవకాశాలను మరియు ఆవిష్కరణల కోసం రూపొందించిన విధానాలను ప్రపంచానికి తెలియజేస్తుంది. సుస్థిరమైన అభివృద్ధి, సాంకేతిక పురోగతి మరియు ఆర్థిక సమానత్వం లక్ష్యంగా, ఈ ప్రతిపాదనలు కేవలం రాష్ట్రానికే కాక, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా బలాన్ని చేకూర్చే విధంగా రూపొందించబడ్డాయి. ఇక ఈ రెండు రోజుల్లో ఏ ఏ సమయంలో వీటిపై సమావేశాలు జరుగుతాయో ఈ కింది ఇమేజ్ లో చూడొచ్చు.

Summit 2025 Day1

Summit 2025 Day2

Exit mobile version