Site icon HashtagU Telugu

Janwada Farmhouse Party : రెండు రోజుల టైం ఇవ్వండి – రాజ్ పాకాల

Rajpaakala Parari

Rajpaakala Parari

జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు విషయంలో KTR (కేటీఆర్) బావమరిది రాజ్ పాకాల విచారణకు హాజరయ్యేందుకు పోలీసులకు సమయం కోరుతూ లేఖ రాశారు. రెండు రోజుల గడువు కోరుతూ మోకిల పోలీసులకు న్యాయవాదుల ద్వారా లేఖ పంపారు. ఈ కేసులో, పోలీసులు రాజ్ పాకాలకు ఈరోజు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ఆయన మోకిలను అడిగి విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరారు.

ఇక నిన్నంతా (ఆదివారం) జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ పై మీడియా లో రకరకాల వార్తలు వైరల్ అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల కు చెందిన ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వ్యవహారం నడిచిందని , పలువురు డ్రగ్స్ తీసుకున్నారని , పెద్ద ఎత్తున విదేశీ మద్యం లభించిందని , ఈ పార్టీ లో కేటీఆర్ భార్య కూడా ఉన్నారని , రాజ్ పాకాల ప్రస్తుతం పరారీలో ఉన్నారని, కేటీఆర్ పై కూడా కేసులు పెట్టబోతున్నారని ఇలా ఏది పడితే అది ..ఎవరికీ తోచినట్లు వాళ్లు మాట్లాడుతూ ..ప్రచారం చేయడం..ఇదే క్రమంలో బిజెపి , కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వచ్చారు. ఈ క్రమంలో సాయంత్రం కేటీఆర్..ఈ వ్యవహారం పై మీడియా తో స్పందించారు.

‘అది ఫాంహౌస్ కాదు. నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు. గృహప్రవేశం చేసినప్పుడు పిలవలేదని ఇప్పుడు ఫ్యామిలీకి పార్టీ ఇచ్చాడు. లిక్కర్ కూడా ఉండొచ్చు. ఆ పార్టీలో నా అత్తమ్మ (నా భార్య తల్లి) , పిల్లలు , బంధువులు ఇలా అంత ఉన్నారు. దావత్ చేసుకోవద్దా..? దావత్ చేసుకునేది కూడా ప్రభుత్వాన్ని అడిగి చేసుకోవాలా..? రాజకీయంగా తమను ఎదుర్కోలేక తమ బంధువులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. కుట్రలతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు..ఇలాంటి చిల్లర ప్రయత్నాలు, కేసులకు తాము భయపడేరకం కాదు. ప్రజల్లో తమపై ఓ దుష్ప్రచారం చేసే భాగంగానే రేవ్ పార్టీ(Rave party) అని ప్రచారం చేసింది. డ్రగ్స్ దొరకలేదని ఎక్సైజ్ అధికారులు(Excise Officers) చెప్పారు. ఉదయం ఎక్సైజ్ కేసు.. సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయిందని అన్నారు.

అసలు డ్రగ్స్ ఎవరు, ఎక్కడ తీసుకున్నారో తెలుసుకోండి ఫస్ట్.. టెస్టు చేస్తే 12 మందికి నెగిటివ్, ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది..ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నారో కనుకోండి.. తమ కుటుంబ సభ్యులు ఫంక్షన్‌కు వస్తే.. పలువురు మహిళలు, పలువురు పురుషులు అని వార్తలు రాయడం ఎంత వరకు కరెక్ట్. మీము పబ్లిక్ లో ఉన్నామని చెప్పి..ఏది పడితే అది రాసేసి..ఏది పడితే అది అనేస్తే చెల్లుతుందా..? తాను అక్కడే ఉన్నానని..పోలీసులు వచ్చే 5 నిమిషాల ముందు అక్కడి నుండి వెళ్లిపోయానని ప్రచారం చేస్తున్నారు. నిన్న సాయంత్రం కేసీఆర్ దగ్గర ఉన్న..అక్కడి నుండి నేరుగా ఇంటికి వచ్చి , భోజనం చేసి , కాసేపు టీవీ చూసి..కూతురి తో మాట్లాడి పండుకున్నానని ఉదయం లేచేసరికి ఈ వార్తలు చూసి షాక్ అయ్యాయని తెలిపాడు.

ఇటు సోమవారం హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వీలుగా ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో రాజ్‌ పాకాల పిటిషన్ వేశారు.

Read Also : Wife Murders Husband : ఆస్తి కోసం భర్తను తెలంగాణలో చంపి.. కర్ణాటకలో తగలబెట్టిన భార్య

Exit mobile version