Site icon HashtagU Telugu

Group 2 Student Suicide : 48 గంటల్లోగా నివేదిక ఇవ్వండి.. ప్రవళిక సూసైడ్ పై గవర్నర్ తమిళిసై రియాక్షన్

Brs leaders fires on Governor tamilisai

Brs leaders fires on Governor tamilisai

Group 2 Student Suicide : హైదరాబాద్‌లో ఉంటూ గ్రూప్‌ 2 ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్న వరంగల్ జిల్లా యువతి  మర్రి ప్రవళిక సూసైడ్ పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ప్రవళిక మృతి పట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక సూసైడ్ పై 48 గంటల్లోగా నివేదికను సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర సీఎస్, డీజీపీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శులను తమిళిసై  ఆదేశించారు. నిరుద్యోగులు ధైర్యం కోల్పోవద్దని సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రవళికది ఆత్మహత్య కాదు.. హత్యే : రాహుల్ గాంధీ

ఇక ఇదే అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘గ్రూప్ – 2 అభ్యర్థిని ప్రవళికది ఆత్మహత్య కాదు.. హత్యే’’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. ‘‘శుక్రవారం హైదరాబాద్ లో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరం. ఇది ఆత్మహత్య కాదు హత్య. తెలంగాణ యువత నేడు నిరుద్యోగంతో విలవిలలాడుతోంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి తమ అసమర్థతతో రాష్ట్రాన్ని నాశనం చేశాయి’’ అని రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. యూపీఎస్సీ తరహాలోనే టీఎస్ పీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు.

పోస్టుమార్టం పూర్తైన అనంతరం.. 

హైదరాబాద్‌లో ఉంటూ గ్రూప్‌ 2 ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్న మర్రి ప్రవళిక అనే యువతి సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ఆమె ఆత్మహత్యతో కలకలం రేగింది. శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆమె బలవన్మరణానికి పాల్పడిందని అంటున్నారు.  గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడటంతో మనస్థాపానికి గురై ఆమె సూసైడ్ చేసుకుందని ఆరోపిస్తూ పలువురు గ్రూప్‌ 2 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించే వరకు మృతదేహాన్ని కదలనివ్వబోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో బీజేపీ సీనియర్ లీడర్ లక్ష్మణ్, బండారు విజయలక్ష్మి పాల్గొన్నారు. అయితే పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. కేసు నమోదు చేసి మృతదేహాన్నిపోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఈ హైడ్రామా కొనసాగింది. ఇక శనివారం ఉదయాన్నే ప్రవళిక తల్లి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి వచ్చి.. కూతురి మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. ప్రభుత్వ ఉద్యోగంతో ఇంటికి వస్తుందని అనుకుంటే ఇలా అయిందంటూ ప్రవళిక తల్లి కన్నీరు మున్నీరయ్యారు. పోస్టుమార్టం పూర్తైన అనంతరం ప్రవళిక మృతదేహాన్ని శనివారం ఉదయం ఆమె స్వగ్రామానికి తీసుకెళ్లారు. ప్రవళిక మృతితో ఆమె స్వగ్రామం బిక్కాజిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read: Jatti Kalaga Wrestling  : ప్రత్యర్ధి రక్తం చిందిస్తేనే గెలిచినట్టు.. ‘జట్టి కలగ’ పోటీల హిస్టరీ