GHMC : 25 ​​ఫంక్షన్‌ హాళ్లను ఏర్పాటు చేయ‌నున్న జీహెచ్ఎంసీ

హైద‌రాబాద‌లో 25 మ‌ల్టీప‌ర్ప‌స్ ఫంక్ష‌న్ హాళ్ల‌ను ఏర్పాటు చేయాల‌ని గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప్ర‌తిపాదించింది....

  • Written By:
  • Updated On - November 22, 2022 / 11:06 AM IST

హైద‌రాబాద్ లో 25 మ‌ల్టీ ప‌ర్ప‌స్ ఫంక్ష‌న్ హాళ్ల‌ను ఏర్పాటు చేయాల‌ని గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ (GHMC) ప్ర‌తిపాదించింది. న‌గ‌రంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లకు ఆదరణ లభించడంతో GHMC ఇప్పుడు  ఫంక్ష‌న్ హాళ్లు ఏర్పాటు చేయాల‌ని భావిస్తుంది. GHMC రూ.95.70 కోట్లతో 25 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లను ప్రతిపాదించగా వాటిలో రూ.30.10 కోట్లతో అభివృద్ధి చేసిన తొమ్మిది క‌ళ్యాణ‌మండ‌పాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న తొమ్మిదితో పాటు రూ.31.89 కోట్లతో మరో తొమ్మిది మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం జరుగుతోందని.. వాటిని త్వరలో ప్రారంభిస్తామని GHMC తెలిపింది. వీటితో పాటు ఇలాంటి మరో ఏడు ఫంక్ష‌న్ హాళ్లు రూ. 33.71 కోట్లతో రహమత్ నగర్, వెంగళ్‌రావు, సూరారం, బేగంపేటలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫంక్షన్ హాళ్లలో చాలా వరకు కళ్యాణ మండపం, డైనింగ్ హాల్‌, కిచెన్ రూమ్‌, పార్కింగ్ సౌకర్యం, తాగు నీటి సౌకర్యం, వధూవరులకు ప్రత్యేక గదులు, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్ తదితరాలతో కూడిన రెండంతస్తుల భవనాలు ఉన్నాయి. దాదాపు అన్ని ఫంక్షన్ హాళ్లలో విట్రిఫైడ్ టైల్స్, ఫాల్స్ సీలింగ్, బయటి కాంపౌండ్ గోడలపై పెయింటింగ్‌లు, ఆర్చ్‌లు ఉన్నాయి.