Site icon HashtagU Telugu

Punjagutta Flyover: ప్రమాదకరంగా మారిన పంజాగుట్ట ఫ్లైఓవర్

Punjagutta Flyover

New Web Story Copy 2023 07 06t164003.791

Punjagutta Flyover: పంజాగుట్ట ఫ్లైఓవర్ అంటే ఎవ్వరికైనా వెన్నులో వణుకు పడుతుంది. గతంలో పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిన ఘటన ఇంకా కళ్ళముందే కదులుతూ ఉంటుంది. ఇక ఆ ఫ్లైఓవర్ మీద జరిగిన ప్రమాదాలు కూడా వణుకు పుట్టిస్తాయి. తాజాగా పంజాగుట్ట ఫ్లైఓవర్ పరిస్థితిని నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.

ప్రమాదకరంగా మారిన పంజాగుట్ట ఫ్లైఓవర్ ఫొటోస్ వైరల్ కావడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ స్థిరత్వంపై ఇంజనీర్ సలహాలను తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ‘టీమ్ రోడ్ స్క్వాడ్’ ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిహెచ్ఎంసి అధికారులు అలెర్ట్ అయ్యారు. వెంటనే ఘటనాస్థలిని సందర్శించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పంజాగుట్ట ఫ్లైఓవర్ పిల్లర్ల పెచ్చులు ఊడినట్టు గమనించవచ్చు. లోపల ఐరన్ రాడ్స్ బయటకు కనిపిస్తున్నాయి. దీంతో ఫ్లైఓవర్ పిల్లర్స్ బలహీనంగా మారే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే పంజాగుట్ట ఫ్లైఓవర్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.

గతంలో పంజాగుట్ట ఫ్లైఓవర్ ప్రమాదాలు చూస్తే.. 2007లో ఫ్లైఓవర్ నిర్మాణ దశలోనే ఉండగా అందులో కొంత భాగం కూలిపోయింది. 2008లో ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. మళ్లీ 2021లో ఫ్లైఓవర్ పిల్లర్‌పై భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Read More: Secunderabad: తప్పతాగి పడిపోయిన తల్లిదండ్రులు.. చిన్నారి కిడ్నాప్?