Diwali: మ‌హాన‌గ‌రంలో బాణ‌సంచా వాడ‌కం నిషేధం…ఆదేశాలు జారీ

పావ‌ళికి చిన్న పెద్ద వారంతా క్రాక‌ర్స్ కాలుస్తూ ఆనందోత్సాహాంతో గ‌డుపుతారు.

  • Written By:
  • Publish Date - October 31, 2021 / 04:20 PM IST

దీపావ‌ళికి చిన్న పెద్ద వారంతా క్రాక‌ర్స్ కాలుస్తూ ఆనందోత్సాహాంతో గ‌డుపుతారు.అయితే గ‌త రెండెళ్లుగా క‌రోనా కార‌ణంగా దీపావ‌ళిని ఎవ‌రూ గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకోవ‌డం లేదు.ఈ ఏడాది కాస్త క‌రోనా త‌గ్గుముఖం పట్ట‌డంతో దీపావ‌ళిని బాగా జ‌రుపుకోవాల‌ని ఎదురు చూస్తున్న ప్ర‌జ‌ల‌కు అధికారులు షాక్ ఇస్తున్నారు. బాణ‌సంచా వాడ‌కాన్ని నిషేధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతో ప్ర‌జ‌లు నిర‌శ‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో గ్రీన్ క్రాక‌ర్స్‌ని మాత్ర‌మే వినియోగించ‌డానికి అనుమ‌తి ఇచ్చారు.

బాణ‌సంచా పేల్చడాన్ని నియంత్రిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకుబాణాసంచా తయారీ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.గ్రీన్ క్రాకర్స్ విక్రయాలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. గ్రీన్ క్రాకర్స్ కాకుండా ఇతర ట‌పాసులు అమ్మకం,వినియోగం నిషేధించబడిందని అధికారులు తెలిపారు.ఈ బాణసంచాను ఎవ‌రైన న‌గ‌రంలో అక్రమంగా దిగుమ‌తి చేసుకున్నా అమ్మినా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.ఇప్ప‌టికే ట‌పాసులు దిగుమ‌తి చేసుకున్న షాపుల‌ను గుర్తించేందుకు బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. నిషేధిత ట‌పాసులు ఎవ‌రైన విక్ర‌యిస్తే వారి స‌మ‌చారాన్ని స‌మీప పోలీస్ స్టేష‌న్‌కు తెలియ‌జేయాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

అయితే న‌గ‌రంలో ఇప్ప‌టికే భారీగా షాపుల్లో ట‌పాసుల‌ను నిల్వ ఉంచారు. గ‌త రెండెళ్లుగా వ్యాపారాలు లేక‌పోవ‌డంతో ఈ ఏడాది ట‌పాసుల విక్ర‌యాలు అధికంగా జ‌రుగుతాయ‌ని నిల్వ‌ల‌ను పెంచారు.అయితే జీహెచ్ఎంసీ బాణసంచా వాడ‌కాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణ‌యంతో వారంతా ఆందోళ‌న‌లో ఉన్నారు. మ‌రి జీహెచ్ఎంసీ ఈ ఉత్త‌ర్వుల‌ను ఎంత‌వ‌ర‌కు అమ‌లు చేస్తుందో వేచి చూడాలి.