Hyderabad: జగన్ ఇల్లు కూల్చివేత తర్వాత కీలక పరిణామం, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బదిలీ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఒకరోజు తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బి హేమంత్ సహదేవ్ రావును బదిలీ చేశారు.

Hyderabad: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఒకరోజు తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బి హేమంత్ సహదేవ్ రావును బదిలీ చేశారు. ఈ మేరకు జిహెచ్‌ఎంసి కమిషనర్ ఇంచార్జి ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే సాధారణ పరిపాలన విభాగానికి నివేదించాలని హేమంత్ సహదేవ్ రావును కోరారు.

ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే ఈ కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్న కారణంగా సదరు అధికారిని బదిలీ చేసినట్లు సమాచారం. శనివారం, జూన్ 15న జిహెచ్‌ఎంసి అధికారులు వైఎస్ జగన్ ఇంటి ఆవరణలో భద్రతా ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ ‘అక్రమ’ నిర్మాణాలను కూల్చివేశారు. పోలీసుల సమక్షంలో ఈ కూల్చివేతలు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ అధికారాన్ని కోల్పోయిన కొన్ని రోజుల తర్వాత ఈ ఆకస్మిక చర్య జరిగింది. కాగా ఏపీలో చంద్రబాబు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. వైసీపీ పార్టీకి 11 సీట్లు గెలుచుకోగా, ఆంధ్రప్రదేశ్ లోని కూటమిలో భాగంగా టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకుంది.

Also Read: Mega vs Allu : మెగా వెర్సస్ అల్లు బాక్సాఫీస్ ఫైట్ రాబోతోందా..? డిసెంబర్‌లో చరణ్, బన్నీ..!