Site icon HashtagU Telugu

Vijayalakshmi: కాంగ్రెస్ లోకి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి?

GHMC Mayor Vijayalakshmi into Congress?

GHMC Mayor Vijayalakshmi into Congress?

 

GHMC Mayor Gadwal Vijayalakshmi: లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్(Congress)పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాల్లో పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలబోతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ(GHMC Mayor Gadwala Vijaya Lakshmi) కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం విజయలక్ష్మీతో కాంగ్రెస్ ఇంచార్జి దీపాదాస్ మున్షీ(Congress in-charge Deepadas Munshi), ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి(Rohin Reddy)లు సమావేశం అయ్యారు. కాంగ్రెస్ లోకి రావాలని దీపదాస్ మున్షీ గద్వాల విజయలక్ష్మీని ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించిన తరువాత నిర్ణయం చెబుతానని, రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోనని, వారి అభిప్రాయం మేరకే తన నిర్ణయం ఉంటుందని విజయలక్ష్మీ చెప్పినట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కొన్ని రోజుల క్రితమే సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గద్వాల విజయలక్ష్మి 11 ఫిబ్రవరి 2021న జీహెచ్ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌కు ఆమె ఐదో మహిళా మేయర్ కాగా… తెలంగాణ వచ్చాక తొలి మహిళా మేయర్. ఆమె బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకురాలు. అమెరికన్ సిటిజన్‌షిప్ కలిగిన విజయలక్ష్మి… అక్కడి నుంచి వచ్చి రాజకీయాల్లో చేరారు.

read also: Blindsight : కంటిచూపు లేని వారికి ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్