Site icon HashtagU Telugu

GHMC Mayor: కాంగ్రెస్‌లోకి GHMC మేయర్.. స్ప‌ష్టం చేసిన ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌..!

GHMC Mayor Vijayalakshmi into Congress?

GHMC Mayor Vijayalakshmi into Congress?

GHMC Mayor: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలేలా ఉంది. జీహెచ్ఎంసీ మేయర్ (GHMC Mayor) గద్వాల విజయలక్ష్మి త్వ‌ర‌లోనే కాంగ్రెస్‌లోకి వెళ్తారని తెలుస్తోంది. గద్వాల విజయలక్ష్మితో పాటు మ‌రో 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్‌లో చేరతారని స‌మాచారం. 2016లో తొలిసారి బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా గెలిచిన విజయలక్ష్మి.. 2021లో రెండోసారి గెలిచి మేయర్‌గా ఛాన్స్ కొట్టేశారు.

Also Read: Pawan Kalyan : చరణ్ ఫై పవన్ ప్రశంసలు కురిపిస్తూ బర్త్ డే విషెష్

ఈ క్ర‌మంలోనే తాజాగా ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌తో GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి భేటీ అయ్యారు. త్వరలోనే ఆమె కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ సంద‌ర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. BRSలో ప్రజా ప్రతినిధులకు విలువ లేదు. అందుకే అందరూ BRSను వీడుతున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తో పాటు KK కూడా కాంగ్రెస్ లోకి వస్తున్నారని చెప్పారు. తనను అనర్హుడిగా ప్రకటించాలని KTR సుప్రీంకోర్టుకు వెళ్తా అంటున్నారు. నేను వాళ్ళ పార్టీ సింబల్ మీద గెలిచా.. వారు సుప్రీంకోర్టుకైనా వెళ్ళవచ్చు తప్పు లేదన్నారు. తాను జూన్ లో ఎంపీగా గెలిచాక MLA పదవికి రాజీనామా చేస్తా అన్నారు. GHMC మేయర్ కు కూడా BRSలో విలువ లేదు. కనీసం ప్రోటో కాల్ పాటించలేదు. కింద్రాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తా అని ధీమా వ్య‌క్తం చేశారు.

We’re now on WhatsApp : Click to Join

K కేశవరావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి 2016 GHMC ఎన్నికల్లో BRS తరపున బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. 2020 లో తిరిగి గెలుపొందారు. తరువాత హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ‘ఆపరేషన్ ఆకర్ష్’లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో తమ ఉనికిని చాటుకునేందుకు బీఆర్‌ఎస్ నుంచి బలమైన నేతలను పార్టీలోకి ఆకర్షించడంపై కాంగ్రెస్ దృష్టి సారిస్తోంది. 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోనప్పటికీ, గ్రాండ్ ఓల్డ్ పార్టీ నగరంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పెట్టుకుంది. ఇప్పటికే కొంతమంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. మరికొంత మంది త్వరలో ఇదే బాట పట్టనున్నారు.

Exit mobile version