GHMC High Alert: ఇండ్లలోనే ఉండండి, బయటకు రాకండి.. సిటీ జనాలకు GHMC అలర్ట్

రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం తో జిహెచ్‌ఎంసి హై అలర్ట్ అయ్యింది.

Published By: HashtagU Telugu Desk
Bengaluru Rains Imresizer

Bengaluru Rains Imresizer

GHMC High Alert: భారీ వర్షాలు హైదరాబాద్ ను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో నిండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం తో గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (జిహెచ్‌ఎంసి) గురువారం హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా హైదరాబాదు వాసులను అప్రమత్తం చేసింది.

గురువారం ఉదయం నుంచి రాత్రి ఇళ్ల నుండి బయటకు రావద్దని కోరింది. “కొన్ని గంటల హైదరాబాద్ అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దయచేసి అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దు. కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం కావచ్చు. విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకండి. అంతరాయం ఏర్పడితే GHMC-DRF సహాయం కోసం 040-21111111, 9000113667కు డయల్ చేయండి” అని GHMC ఒక ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్ తో పాటు తెలంగాణలో భారీ వర్షాలు (Rains) కురుస్తుండడం తో వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడిక్కడే రోడ్లు తెగిపోయి ప్రజా రవాణా స్థంభించిపోయింది. మరో రెండు , మూడు రోజల పాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపడం తో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లోద్దని , చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండకూడదని , కరెంట్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ముట్టుకోరాదని , అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు.

Also Read: Anasuya Bharadwaj: ఫారిన్ లో చిల్ అవుతున్న అనసూయ, లేటెస్ట్ ఫిక్స్ వైరల్

  Last Updated: 27 Jul 2023, 12:49 PM IST