GHMC : సికింద్రాబాద్ ఆల్ఫా హోట‌ల్‌ని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ ఫుడ్‌ సెఫ్టీ అధికారులు

సికింద్రాబాద్‌లో ఆల్ఫా హోట‌ల్‌లో జీహెచ్ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు కొన్ని రోజుల క్రితం త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ

  • Written By:
  • Publish Date - September 17, 2023 / 10:24 PM IST

సికింద్రాబాద్‌లో ఆల్ఫా హోట‌ల్‌లో జీహెచ్ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు కొన్ని రోజుల క్రితం త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ త‌నిఖీల్లో హోట‌ల్‌లో నాణ్యాతా ప్ర‌మాణాల‌ను పాటించ‌డంలేద‌ని అధికారులు గుర్తించారు. వీటిని స‌రిచేసుకోవాల‌ని అధికారులు హోట‌ల్ యాజ‌మాన్యానికి నోటీసులు జారీ చేసి స‌మ‌యం ఇచ్చింది. అయితే హోట‌ల్ యాజ‌మాన్యం ఎలాంటి మార్పులు చేయ‌లేదు. ఈ రోజు (ఆదివారం) ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎ) బృందం హోటల్‌లో మరోసారి తనిఖీ నిర్వహించగా, ఆహార భద్రత సమస్యలను తగినంతగా పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందని తేలింది. దీంతో ఆ హోటల్‌కు సీజ్ చేశారు. ఆల్ఫా హోటల్ హోటల్‌లో కొందరు యువకులు మటన్ కీమా, రోటీ తిన్నారు. అనంతరం.. వాళ్లంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో యువకులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. హోటల్‌లో తనిఖీలు చేశారు.హోటల్‌లో నాణ్యత, శుభ్రత లేదని గుర్తించిన అధికారులు వెంటనే హోటల్‌ను సీజ్ చేశారు. అయితే.. అస్వస్థతకు గురైన యువకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వాళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు