GHMC Deputy Mayor Srilatha : బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి

  • Written By:
  • Publish Date - February 24, 2024 / 03:45 PM IST

బిఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుండి ఇంకా బయట పడకముందే..వరుస పెట్టి నేతలు రాజీనామాలు చేస్తూ కాంగ్రెస్ గూటికి చేరుతుండడంతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇప్పటీకే మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు ఇలా ఎంతో మంది చేరగా..తాజాగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి (GHMC Deputy Mayor Srilatha )..బిఆర్ఎస్ కు రాజీనామా (Resign ) చేసారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాసారు. పార్టీ కోసం ఎంతో కష్టపడినప్పటికీ.. పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోతుందంటూ, అందుకే పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కొద్దీ రోజుల క్రితం వీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తన భర్త శోభన్ రెడ్డితో కలిసి ఆమె సీఎంతో భేటీ అయ్యారు. రెండు రోజుల్లో శ్రీలత దంపతులు కాంగ్రెస్ లో చేరనున్నట్టు అప్పుడే వార్తలు వచ్చాయి. కానీ తర్వాత చేరలేదు. ఇక ఈరోజు బిఆర్ఎస్ కు రాజీనామా చేయడం తో కాంగ్రెస్ లోకి వారి చేరిక అధికారమే అయ్యింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా విజయాలు దక్కాయి. అయితే హైదరాబాద్ లో మాత్రం బిఆర్ఎస్ పూర్తి ఆధిక్యతను కనపరిచింది. దీంతో, కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో హైదరాబాద్ పై ఫోకస్ చేసింది.

జీహెచ్ఎంసీ కార్పొరేటర్లను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బిఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరారు. అయితే కొంత కాలంగా బిఆర్ఎస్ హైకమాండ్ పై శ్రీలత దంపతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఇప్పడూ వారు కూడా కాంగ్రెస్ లో చేరడం ఖాయం అయ్యింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ ఖాళీ అవుతుండడం ఆ పార్టీ కీలక నేతల్లో ఆందోళన పెరుగుతుంది.

Read Also : PM Kisan: రైతుల‌కు గుడ్ న్యూస్‌.. ఫిబ్ర‌వ‌రి 28న పీఎం కిసాన్ 16వ విడ‌త‌.. వారికి మాత్రం బ్యాడ్ న్యూస్‌..!