Amrapali Kata : హైడ్రా అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆగ్రహం

Amrapali Kata : GHMC జీతం తీసుకుంటూ..హైడ్రా కు పనిచేస్తూ..GHMC పనులను పక్కకు పెట్టిన అధికారులపై ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published By: HashtagU Telugu Desk
IAS Amrapali Kata

IAS Amrapali Kata

GHMC Commissioner Amrapali angry with Hydra officials : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి (GHMC Commissioner Amrapali Kata) ఆగ్రహానికి గురైంది. GHMC జీతం తీసుకుంటూ..హైడ్రా కు పనిచేస్తూ..GHMC పనులను పక్కకు పెట్టిన అధికారులపై ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా విజిలెన్స్ విభాగం అధికారులు హైడ్రాను వీడటం లేదని..హైడ్రా కమిషనర్‌కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైడ్రా (Hydra) ..ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) నగరవ్యాప్తంగా హడలెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. నగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తూ… ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా ప్రతిఘటిస్తూ హైడ్రా దూసుకెళ్తుంది. ఇప్పటికే వందల ఇల్లు నేలమట్టం చేసింది.

హైడ్రా లో GHMC అధికారులు కూడా పనిచేస్తున్నారు. అయితే పూర్తి టైం హైడ్రాకే కేటాయిస్తుండడం తో GHMC పనులు పెండింగ్ లో పడుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేసారు. GHMCలో జీతం తీసుకుంటూ హైడ్రాలో పనిచేస్తోన్న అధికారులపై ఆమె సీరియస్ అయ్యింది. విజిలెన్స్ విభాగం అధికారులు హైడ్రాను వీడటం లేదని , హైడ్రా కమిషనర్‌కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదని , తమ పరిధిలో పనిచేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దని ఆమె ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రోజువారీ కార్యక్రమాలు, విచారణల్లో విజిలెన్స్ అధికారుల అవసరం ఉంటుందని స్థాయీ సంఘం సభ్యులు చెబుతున్నారు. కానీ వారంతా ఆ బాధ్యతలు నిర్వర్తించడం లేదని అంటున్నారు. ఈ మేరకు సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేయడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Read Also : Nail Polish Effects: నెయిల్ పాలిష్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. క్యాన్స‌ర్ వ‌స్తుందా..?

  Last Updated: 13 Sep 2024, 03:04 PM IST