Site icon HashtagU Telugu

Alert : అత్యవసరమైతేనే బయటకు రండి…హైదరాబాదీలకు GHMC హెచ్చరిక..!!

హైదరాబాద్ నగర్ వాసులకు జీహెచ్ఎంసీ మంగవారం సాయంత్రం ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది జీహెచ్ ఎంసీ.

నగరంలోని సికింద్రాబాద్, అల్వాల్, నేరెడ్ మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాలు ఇప్పటికే జలమయ్యాయని తెలిపారు. జీహెచ్ఎంసీ హెచ్చరికల నేపథ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దింపారు.