Site icon HashtagU Telugu

Telangana: కాంగ్రెస్ పూర్తిగా గేట్లు తెరిస్తే కారు షెడ్డుకే: సీఎం

Telangana

Telangana

Telangana: కాంగ్రెస్ పూర్తిగా గేట్లు తెరిస్తే కారు షెడ్డుకే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి ఒక గేటు మాత్రమే తెరిచామని, పూర్తిగా గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు సీఎం. ఆదివారం బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో జరిగిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి, గత పది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని నియంతృత్వ ధోరణిలో పాలించారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. నిజాం పాలకులు ఎన్నో అభివృద్ధి పనులు చేసినా వారి నిరంకుశపాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారని ఉదాహరిస్తూ తెలంగాణ సమాజం బానిసత్వాన్ని సహించదని చరిత్ర చెబుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ఒక్క గేటు మాత్రమే తెరిచామని, బీఆర్‌ఎస్‌ నుంచి పెద్దఎత్తున నేతలు వస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అన్ని గేట్లు తెరిస్తే ఏం జరుగుతుందో ఊహించలేం. ప్రతిపక్ష పార్టీ ఖాళీ అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ తన కార్యాచరణను కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు మరియు భవిష్యత్తులో బిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీలు రెండూ తమ తమ రాజకీయ సంక్షోభాన్ని చూస్తాయని స్పష్టం చేశారు సీఎం రేవంత్.

తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. దానం, గుత్తా , దయాకర్, రంజిత్ రెడ్డి తదితరులు ఇప్పటికే గులాబీ పార్టీని వీడారు. మరికొద్ది రోజుల్లో కారు పార్టీలో కీలక నేతలు బయటకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మల్లారెడ్డి బయటకు వచ్చేందుకు సిద్దమైనప్పటికీ పరిస్థితులు అతనికి సహకరించడం లేదు. ఎందుకంటే మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి వెళదామనుకున్నా, సీఎం రేవంత్ అతడిని ఆహ్వానించే అవకాశం లేదనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కర్ణాటక డిప్యూటీ సీఎంతో రికమండేషన్ కోరినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా త్వరలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరగవచ్చని తెలుస్తుంది.

Also Read: Sukumar : పుష్ప 2 తర్వాత సుకుమార్ హీరో అతనేనా..?

Exit mobile version